ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల మూవీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌తో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ అభిజీత్‌కు తరువాత ఎలాంటి ఆఫర్లు రాలేదు. అయితే బిగ్ బాస్ సీజన్ 4 విజేతగా నిలవడంతో అతను మళ్లీ తన కెరీర్ ట్రాక్‌లో పడుతుందని భావిస్తున్నాడు. బిగ్‌బాస్ విన్నర్‌గా నిలవడంతో వచ్చిన పాపులారిటీ ద్వారా అతను రెండో ఇన్నింగ్స్‌ను సినీ ఇండస్ట్రీలో ప్రారంభించి దాంతో సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు.
అయితే అభిజీత్ అంటే ఇష్టపడే ఎంతో మంది అమ్మాయిలు ఉన్నప్పటికీ అతను ఇప్పటి వరకు వివాహం చేసుకోలేదు. కానీ మీకు ఎలాంటి అమ్మాయి అంటే ఇష్టం అని అడిగితే సింపుల్‌గా ఉంటే చాలని బదులిచ్చాడు. అలాగే తనతో చక్కగా మాట్లాడగలిగే అమ్మాయి అయి ఉండాలని తెలిపాడు. ఇక లవ్, బ్రేకప్స్ వంటి విషయాల గురించి అడిగితే.. అవన్నీ ఇప్పుడెందుకండీ.. అంటూ సింపుల్‌గా బదులిచ్చాడు.
ఇక బిగ్‌బాస్ సీజన్ 4లో పలువురు ఫీమేల్ కంటెస్టెంట్లు అభిజీత్ కూల్ యాటిట్యూడ్‌కి ఆకర్షితులయ్యారు కానీ ఎవరితోనూ అతను రొమాంటిక్ ట్రాక్ నడపలేదు. కానీ హారికతో మాత్రం చక్కని ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. అయితే గత బిగ్‌బాస్ సీజన్‌లలో విన్నర్లుగా నిలిచినప్పటికీ ఎవరూ కూడా ఆ తరువాత అంత పెద్దగా సక్సెస్ అవ్వలేదు. కానీ బిగ్ బాస్ ఫేం అంటూ అందులో పాల్గొన్నవారికి కొంత పేరు వచ్చింది. ఇక కొందరికి ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ అవి తాత్కాలికమే. అయితే బిగ్‌బాస్ ద్వారా వచ్చిన పేరుతో దీర్ఘకాలం పాటు సక్సెస్ సాధించింది ఎవరూ లేరు. మరి అభిజీత్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.