ఇప్పుడు సినిమా నటుల ప్రేమ వ్యవహారాలు మీడియాలోకి వచ్చి సంచలనం అవుతున్నాయి గాని ఒకప్పుడు మాత్రం అలా ఉండేది కాదు. సినిమా నటులు అనేక విషయాల గురించి ఇతర నటులతో చర్చించే వారు. వారి మధ్య సాన్నిహిత్యం అలా ఉండేది. అలాంటి వారిలో ఎన్టీఆర్, రేలంగి కూడా ఉన్నారు. ఎన్టీఆర్ కు ఒకప్పుడు అవకాశాలు రావడానికి రేలంగి కారణం అంటారు.
Also Read:కూసుకుంట్లకు బీఫామ్.. కేసీఆర్ కీలక ఆదేశం!
అలా ఇద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగి అన్ని విషయాలు మాట్లాడుకునే వరకు వెళ్లారట. పిల్లల చదువులు, ఆస్తి వ్యవహారాలు, ఆర్ధిక కష్టాలు ఇలా ఎన్నో విషయాలు చర్చకు వచ్చేవి. ఇలాంటి ఒక విషయమే ఎన్టీఆర్ కు రేలంగికి మధ్య వచ్చింది. అదే రేలంగి ప్రేమ వ్యవహారం. గుమ్మడి తన పుస్తకంలో ప్రస్తావించినట్టుగా… రేలంగి పెళ్లి అయి… కొడుకు ఉన్న తర్వాత కూడా ఒక హీరోయిన్ తో ప్రేమలో పడ్డారు.
ఆమె ఆయన వెంట బాగానే తిరిగి కొన్ని రోజులు ఆయన్ను ఆర్ధికంగా బాగానే వాడుకుంది. రేలంగి తన భార్యకు విడాకులు కూడా ఇచ్చేద్దాం అనుకున్నారట. ఆమెకు సినిమాల్లో అవకాశాలు కూడా ఇప్పించే వారట. అయితే పెళ్లి విషయానికి వచ్చేసరికి ఆమె డ్రామాలు ఆడటంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందట. దీనితో ఏం చేయాలో అర్ధం కాక ఎన్టీఆర్ వద్దకు వచ్చి అసలు విషయం చెప్పారట రేలంగి. రేలంగి మీద సీరియస్ అయిన ఎన్టీఆర్… ఆ హీరోయిన్ తో కూడా మాట్లాడారట. ఆమె నిజస్వరూపం అర్ధం కావడంతో తెర వెనుక వ్యూహంతో ఆమెకు అవకాశాలు రాకుండా సినిమా పరిశ్రమ నుంచే పంపేసారట.