టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ డైరెక్టర్ లు అనగానే వినపడే పేర్లు కొన్ని ఉన్నాయి. రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్. ఈ ముగ్గురు దర్శకులకు చాలా క్రేజ్ ఉంది. వాళ్ళ దగ్గర కథ ఉంటే చాలు ఏంటి, ఎలా అని అడగకుండా నిర్మాతలు కూడా పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇప్పుడు చాలా మంచి క్రేజ్ ఉంది. మహేష్ బాబు ఆయనతో సినిమా చేస్తున్నారు.
రెండేళ్ళ నుంచి మహేష్ బాబు ఆయనతో సినిమా చేయడానికి ఎదురు చూస్తున్నారు అని టాక్ కూడా వచ్చింది. రైటర్ గా కథలు, డైలాగ్ లు ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు స్టార్ దర్శకుడు అయ్యారు. ఆయన కెరీర్ మొదట్లో స్వయం వరం, నువ్వు నాకు నచ్చావ్ వంటి సినిమాలకు కథలు ఇచ్చారు. ఆయన మాటలకు అప్పుడు సినిమా పరిశ్రమ షాక్ అయింది. ఆ తర్వాత నాగార్జున ఆయనతో సినిమా చేయాలి అనుకున్నారు.
అందుకోసం ఒక కథ రాసారు. అదే మన్మథుడు సినిమా కథ. ఈ కథలో డైలాగ్ లు నాగార్జునకు చాలా బాగా నచ్చాయి. త్రివిక్రమ్ ని అడిగితే ఆయన కోటి రూపాయలు ఇస్తేనే కథ ఇస్తాను అని అన్నారట. అప్పటి వరకు నిర్మాత 50 లక్షల మించి రైటర్ కు ఇవ్వలేదు. దీనితో నాగార్జున షాక్ అయ్యారు. కాని త్రివిక్రమ్ చేసిన తక్కువ సినిమాలకే మంచి ఇమేజ్ ఉండటంతో విజయ భాస్కర్ దర్శకత్వంలో ఆ కథ చేసారు. అది సూపర్ హిట్ అయింది.