జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో టెంపర్ సినిమా ఒక మంచి జ్ఞాపకం అనే చెప్పాలి. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న ఎన్టీఆర్ కు ఈ సినిమా సాధించిన ఘన విజయం మంచి బూస్ట్ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఫ్లాప్ చూడలేదు అనే మాట వాస్తవం. అక్కడి నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా వరకు వరుస హిట్ లు కొట్టాడు. పూరి జగన్నాథ్ కు కూడా ఈ సినిమా మంచి జ్ఞాపకం అనే చెప్పాలి.
పూరి కూడా అంతకు ముందు కొన్నేళ్ళ పాటు సరైన విజయం లేక ఇబ్బందులు పడుతున్నాడు. అయితే ఈ సినిమా విషయానికి వస్తే కథ పూరి రాసుకుంది కాదు. వాస్తవానికి పూరి తన సినిమాలకు తానే కథ రాసుకుంటాడు. కాని వక్కంతం వంశీ దగ్గర ఉన్న కథ ఎన్టీఆర్ కు నచ్చింది. ఆ కథ పూరి జగన్నాథ్ చేస్తే బాగుంటుంది అని వంశీతో మాట్లాడి పూరిని ఒప్పించి ఆ సినిమా చేసాడు.
అయితే ఈ సినిమా క్లైమాక్స్ కాస్త భిన్నంగా ఉండాలి అనేది పూరి ప్లాన్. క్లైమాక్స్ విషయంలో వంశీ, పూరి మధ్య చర్చలు నడిచాయి. సీడీ పోయిన తర్వాత హీరో కోర్ట్ నుంచి బయటకు వచ్చి విలన్ ని చంపేస్తాడు అని పూరి అనుకున్నాడు. కాని అది వంశీకి నచ్చకపోవడంతో కాస్త సమయం తీసుకుని హీరో కూడా దోషి అవ్వాలని… ఆ తర్వాత జైలులో ఫైట్ పెట్టాలని అలా పెడితే హీరో మీద సాఫ్ట్ కార్నర్ ఇంకా పెరుగుతుంది ఫాన్స్ నుంచి స్పందన బాగుంటుందని అలా చెప్పగా పూరికి కూడా బాగా నచ్చి ఓకే చేసాడు.
Also Read: గోపిచంద్ మలినేని, ఎన్టీఆర్ కు కథ చెప్తే ఏం అన్నాడు…?