సాధారణముగా డ్రైవర్ లు రాత్రి వేళల్లో తమ ప్రయాణాలు పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అనవసర ట్రాఫిక్ లేకుండా రాత్రి సమయంలో వేగంగా వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళు నిద్రను ఆపుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో నిద్ర ఎక్కువగా ఉంటుంది కాబట్టి లేనిపోని సమస్యలు వస్తాయనే మాట వాస్తవం.
Also Read: పవన్ కండిషన్స్ పై డైరెక్టర్స్ అసహనం ?
ఇక డ్రైవర్ లు రాత్రి సమయాల్లో నిద్ర పోకుండా ఉండేందుకు కొన్ని చిట్కలాను ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు చేసే బస్ డ్రైవర్ లకు ఈ చిట్కాలు చాలా అవసరం. ఇక నిద్ర రాకుండా ఉండాలి అంటే… డే టైం లో 6 గంటలు కనీసం నిద్రపోతూ ఉంటారు. ఆరు గంటల నిద్రపోతే రాత్రి సమయంలో నిద్ర ఆపుకోవడానికి వీలు ఉంటుంది. అదే విధంగా పగలు సమయంలో నిద్రపోతే ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ ఉంటారు.
ఆ విధంగా చేసినా కూడా నిద్ర వస్తుంటే కాఫీ లేదా టీ తాగి మళ్ళీ డ్రైవ్ చేసుకుంటే మంచిది. నైట్ జర్నీ లో టి కంటె కాఫీ తాగడమే మంచిదని చెప్తున్నారు డ్రైవర్ లు. కాఫీ తాగితే ఎక్కువ సేపు నిద్ర రాకుండా ఉంటుంది. ఇంకా డ్రైవ్ చేస్తూ నిద్ర వస్తే… ఏదైనా చిప్స్ లేదా పల్లీలు వంటివి తింటూ డ్రైవ్ చేయాలి. ఇక పాటలు వినడం వంటివి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు.
Also Read: రాష్ట్రాన్ని నాస్తికుల రాజ్యంగా మారుస్తున్నారు.. బండి సంజయ్