ఒక సినిమా షూటింగ్ అంటే అందులో ఎన్నో విషయాలు ఉంటాయి. ప్రతీ చిన్న విషయం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. అలాంటి ఒక విషయమే సినిమాల్లో వాడే దుస్తులు ఏం చేస్తారు అనేది. సినిమాల్లో వాడే దుస్తుల కోసం దర్శకుడు ఎన్నో ఆలోచనలతో ఉంటాడు. కాస్ట్యూమ్ డిజైనర్ వాటి కోసం తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. అయితే ఆ దుస్తులు సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అనేది ఎవరికి తెలియదు.
Also Read:రాజమౌళి సినిమాల్లో ఉండే కామన్ పాయింట్ ఇదేనా…?
షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ బట్టలను ఉతికించి ఇస్త్రీ చేస్తారు. గతంలో వాటిని తర్వాతి సినిమాలకు వాడే వారు. హీరో పక్కన ఉండే పాత్రలకు గాని, లేదంటే చిన్న చిన్న నటులకు గాని వాడే వాళ్ళు. ఆ తర్వాతి కాలంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా వాటిని వేలం పాట వేయడం మొదలుపెట్టారు. అయితే ప్రజలలో క్రమంగా ఆ ఆసక్తి తగ్గిపోవడంతో నిర్మాతల ఆలోచన మారింది.
ఆ దుస్తులను భద్రపరిచి తర్వాతి సినిమాల కోసం వాడటం గాని, చిన్న చిన్న సినిమాలకు ఉపయోగించడం గాని చేస్తున్నారు. క్యారెక్టర్ ల పరంగానూ, జూనియర్ ఆర్టిస్టుల పరంగానూ సైజుల వారీగా దుస్తులు సరఫరా చేస్తూ ఉంటారు. వాటిని అద్దెకు ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ తీసుకుంటారు. కొందరు నటీనటులు షూటింగ్ అయ్యాకా ఆ దుస్తులు కావాలని అడిగి తీసుకుంటారు.
అలాగే వాటిని సీరియల్స్ కోసం గాని లేదంటే… షార్ట్ ఫిలిమ్స్ కోసం గాని వాడుతూ ఉంటారు. ప్రస్తుతం షార్ట్ ఫిలిమ్స్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇక నిర్మాతలు వృధా చేయడం ఇష్టం లేక… ఇతర భాషల సినిమాల వాళ్లకు లేదంటే… టీవీ కార్యక్రమాలు చేసే వాళ్లకు విక్రయిస్తున్నారు. స్టార్ హీరోలు కొందరు ఆ దుస్తులను తీసుకుని తమ సినిమా జ్ఞాపకంగా దాచుకుంటున్నారు.
Also Read:దేశంలో పెరుగుతున్న కరోనా.. హెచ్చరించిన ఆరోగ్య శాఖ..!