జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళీ. తెలంగాణ రాష్ట్రంలో పవన్ కు, షర్మిలకి ఏం పని అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.
సొంత రాష్ట్రాన్ని వదిలి.. పొరుగు రాష్ట్రంలో ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ‘’ఇతర రాష్ట్రాల వాళ్లకు తెలంగాణలో ఏం పని?, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ లో ఏం పని?” అని నిలదీశారు.
‘కడప జిల్లాకు చెందిన షర్మిల, భీమవరంకు చెందిన పవన్ కళ్యాణ్ కు ఇక్కడేం పని అన్నారు. వారి వద్ద బాగా డబ్బుందని అందుకే రాజకీయ వ్యాపారం చేస్తున్నారంటూ ఆరోపించారు.
వాళ్లకు ఇంత డబ్బు ఎక్కడ నుండి వచ్చింది? ఏం వ్యాపారాలు చేశారంటూ’ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. అదంతా అవినీతి డబ్బే కదా అంటూ విమర్శించారు ఆకునూరి మురళి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వేరే రాష్ట్రాల వాళ్లకు మాతెలంగాణలో ఏం పని?
కెసిఆర్ కు ఆంధ్ర లో ఏం పని?
షర్మిల(కడప జిల్లా)కు,పవన్ కళ్యాణ్ (భీమవరం జిల్లా)కు ఇక్కడేం పని?
బాగా డబ్బు ఉందని వీళ్ళు రాజకీయ వ్యాపారం చేస్తున్నారు
అస్సలు వీళ్లకు ఇంత డబ్బు ఎక్కడ నుండి వచ్చింది? ఏం వ్యాపారాలు చేసిన్రు?
అవినీతి డబ్బే కదా! pic.twitter.com/Jca4tex1de— Murali Akunuri (@Murali_IASretd) January 25, 2023