ఈ సృష్టిలో ఒకప్పుడు వృధాగా పోయిన వాటిని చూసి చాలా మంది బాధ పడే వారు గాని ఈ మధ్య కాలంలో అసలు ఏదీ వృధాగా పోవడం లేదనే చెప్పాలి. మురుగు నీరు కూడా ఎక్కువగా వృధాగా పోనీయడం లేదు ఈ రోజుల్లో. డ్రైనేజిలో వృధాగా పోయే మురికినీటిని కూడా ప్రాసెస్ చేసి వాష్ రూముల్లోనూ త్రాగనక్కర లేని నీటి అవసరాలకు ఎక్కువగా వాడుతున్నారు. అదే విధంగా పడేసే చెత్త నుంచి కూడా ఎన్నో తయారు అవుతున్నాయి.
మనం పడేసే చెత్తనుంచే ఎన్నెన్నో తయారు చేసే యూనిట్లు వస్తున్నాయి. పెద్ద పెద్ద కర్మాగారాలు, హోటళ్లలో కూడ బయటికి పోయే బాత్ రూంల నుంచి పోయే నీటిని కూడా కొన్ని అవసరాలకు వాడుతున్నారు. అదే విధంగా చాలా మందికి ఉండే సందేహం ఏంటీ అంటే… ప్రతిరోజూ అమ్ముడుపోని దినపత్రికలను ఏం చేస్తారు అనేది చాలా మందికి స్పష్టత లేదు. వాటిని షాప్ ల వాళ్లకు కూడా విక్రయిస్తూ ఉంటారు కాబట్టి… వాళ్లకు నష్టమే కదా అనే సందేహం చాలా మందిలో ఉంది.
ఆ దినపత్రికలు హోల్ సేల్ ఏజంట్ల నుంచి ఆ తరవాత వారినుండి ఆ దినపత్రిక ముఖ్యకార్యాలయానికి చెందిన ఒక సంస్థకు వెళ్తాయి. ఆ తరవాత అవి అన్నీ ఒక యాంత్రికవిధానంలో క్రష్ చేయబడి ప్యాకింగులో విస్తృతంగా ఉపయోగించే సన్నని ముక్కల మాదిరి వాడతారు. పేపర్ పల్పు, కొంత న్యూస్ ప్రింటుగాను మారుస్తారు. మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి… ఈ రోజుల్లో అసలు ఏదీ వృధా అయ్యే అవకాశమే లేదు. రోడ్డు మీద పేపర్లను కూడా ఏరుకుని వాటిని కూడా మంచి అవసరాలకు వాడే వాళ్ళు ఉన్నారు. మనం పొట్లానికి ఉపయోగించే పేపర్ కూడా ఈ రోజుల్లో ఉపయోగపడుతుంది.