ఎప్పుడైనా విమాన ప్రయాణం చేసారా…? విమాన ప్రయాణం చేస్తే విమానం మేఘాల కంటే ఎక్కువ ఎత్తులో ఎగరడం గమనించారా…? ఎన్నో వేల అడుగుల ఎత్తులోకి వెళ్ళిన విమానం నుంచి బయటకు చూస్తే మనకు ఏం కనపడదు మన కింద మేఘాలు ఉంటాయి. ఎందుకు అంత ఎత్తులో విమానాలు ఎగురుతాయో ఒకసారి చూద్దాం.
Also Read:ఆర్ఆర్ఆర్ 2 రోజుల వసూళ్లు.. మరిన్ని రికార్డులు
అలా ఎందుకు అంత ఎత్తులో అంటే మైలేజ్ కోసం అన్నమాట. ఇంధనం పొదుపు చేయడం ద్వారా ఖర్చు తగ్గించుకోవడం అలాగే ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవడానికి. కారు హైవే మీద వెళ్ళిన దానికి సందుల్లో వెళ్ళిన దానికి మైలేజ్ తేడా ఉంటదిగా ఇది కూడా అంతే. అకాశంలో ఎత్తుకు వెళ్లిన కొద్దీ… గాలి సాంద్రత తగ్గుతుంది. గాలిలో నీటి ఆవిరి, మరి కొన్ని ఆటంకాలు కూడా చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. గాలి సాంద్రత తగ్గినప్పుడు విమానగమనానికి నిరోధం (డ్రాగ్) కూడా చాలా తగ్గుతుంది.
గాలి విసురు తక్కువగా ఉన్నప్పుడు, గాలి చల్లగా, పొడిగా, స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఇంజన్లు ఎంతో బాగా తమ కర్తవ్యం నిర్వహిస్తాయి. అందుకే అవి తక్కువ ఇంధనం వాడుకుంటాయి. ఇక విమానాలు ఎక్కువ ఎత్తులో వెళ్ళడానికి కారణం పక్షులు ఢీకొనడం వలన కలిగే ప్రమాదాలను, ఇతర చిన్న విమానాల వలన ఏర్పడే రద్దీని నివారించడం కూడా మరో కారణం. మేఘాలలో నుంచి పడే పిడుగులనుండీ, వేడి గాలుల వలన ఏర్పడే టర్బులెన్స్ ను తప్పించుకోవడం కూడా.
Advertisements
Also Read:స్పీచ్ తో ఆకట్టుకున్న కేజీఎఫ్ హీరో