రాయలసీమ జిల్లాల్లోని చిత్తూరు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు విజయనగరం, సిక్కోలు, విశాఖ… ఏనుగుల పేరు వింటే చాలు భయపడే పరిస్థితి. అడవుల్లో ఉండే ఏనుగులు ఊళ్ళ మీద పడి చేసే దారుణాలు అన్నీ ఇన్ని కాదు. వీటి దెబ్బకు వ్యవసాయం కూడా చేయడం లేదు. ఇక మనుషుల మీద అవి చేసే దాడులు కూడా పెరుగుతున్నాయి. అసలు ఏనుగులు దాడి చేసే ముందు వాటి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియక చాలా మంది బలవుతున్నారు.
ఏనుగులు అంత భారీ శరీరంతో ఉన్నా సరే గంటకు 40 కిలోమీటర్ల వేగంతో నడవడం ఆందోళన కలిగించే అంశం. తమ చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో ఉండే నీటిని కూడా అవి గుర్తిస్తాయి. రెండు కిలోమీటర్ల పరిధిలో ఉండే ఆహారాన్ని కూడా గుర్తించడం గమనార్హం. ఇక సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో నీళ్ళు తాగి రాత్రి సమయాల్లో పొలాల మీద పడే అవకాశం ఉంది. ఇక అవి దాడి చేసే విషయాన్ని మనం ముందే తెలుసుకోవచ్చు.
ఏనుగులకు కోపం వస్తే గనుక ముందుగా మొదట కాలు దువ్వి… కోపం మరింత పెరిగితే సిగ్నల్ గా చెవులను ముందుకూ వెనక్కు ఊపుతూ ఉంటాయి. కాలు దువ్వి మట్టిని తల మీద, వీపు మీద వేసుకోవడం ప్రధాన సిగ్నల్. ఒక అడుగు ముందుకు వేసి… మరో అడుగు వెనక్కు వేస్తూ ఉంటాయి. తొండాన్ని పైకి లేపి తల ఊపుతాయి. ఇవి కనపడితే గనుక ఏనుగు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవి డైరెక్ట్ గా మన తలనే టార్గెట్ చేస్తాయి.
Advertisements
Also Read: ఉచిత పథకాలతో రాష్ట్రాలకు షార్ట్ సర్క్యూట్