ఎవరైనా మన వాళ్ళు విదేశాల్లో ఉంటే వాళ్ళ కోసం లేదా వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మనకు కూడా వాళ్ళ వద్దకు వెళ్లి స్థిరపడాలని వాళ్ళతో కలిసి ఉండాలని ఎంతో కోరికగా ఉంటుంది. అమెరికా దేశం తీసుకుంటే… భర్త లేదా భార్య అక్కడికి వెళ్లి ఉంటే వాళ్ళ దగ్గర కు వెళ్ళాలి అనే కోరిక బలంగా ఉంటుంది. అందుకోసం వీసా ప్రయత్నాలను చాలా గట్టిగా బలంగా చేస్తూ ఉంటారు.
వీసా స్పాన్సర్ చేస్తే వెళ్ళాలి అనుకుంటారు. అసలు వీసా స్పాన్సర్ చేయడం అంటే ఏంటీ…? వీసాలలో టూరిస్ట్ వీసా, విజిట్ వీసా, వర్క్ పర్మిట్, రెసిడెన్సీ వీసా, పిఆర్,.. ఇలా ఎన్నో ఉన్నాయి. విజిట్ వీసా, టూరిస్ట్ వీసా రెండూ ఒక దాని కిందనే వస్తాయి. అలాగే వర్క్ పర్మిట్, రెసిడెన్సీ వీసా రెండూ ఒకే దాని కింద వస్తాయి. వివిధ దేశాలలో వేర్వేరు పేర్లు, వేర్వేరు వీసా గడువులు, వేర్వేరు నియమ నిబంధనలు వీసాలకు ఉంటాయి.
అయితే ఎవరికి అయితే పర్మనెంట్ రెసిడెన్సీ, రెసిడెన్సీ వీసాలు ఉంటాయో, వారు తమ వారిని తమతో ఆ దేశంలో ఉండటానికి వీసాను స్పాన్సర్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకు ఒక భర్త తన భార్యకు, తల్లిదండ్రులకు వీసా స్పాన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక భార్య తన భర్తను, స్వంత కుటుంబ సభ్యులను పిలించుకోవడానికి అవకాశం ఉంటుంది. అమెరికా, యూరప్ వంటి దేశాల్లో ఉండే వారే ఎక్కువగా స్పాన్సర్ చేస్తూ ఉంటారు.