సోషల్ మీడియా దిగ్గజాల్లో ట్విటర్ ఇప్పుడు దూసుకుపోతుంది. మాస్ ఆడియన్స్ కూడా ఈ మధ్య కాలంలో ట్విట్టర్ వైపు చూస్తున్నారు. ఇక ట్విట్టర్ విషయంలో రాజకీయ నాయకులు కూడా సీరియస్ గా ఫోకస్ చేసారు. ఇప్పుడు బ్లూ టిక్ కోసం రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తీవ్రంగా కష్టపడుతున్నారు. ప్రొఫైల్ నేమ్ పక్కనే బ్లూ టిక్ ఉంటే ఆ ప్రొఫైల్ ను ట్విట్టర్ అధికారికంగా ధృవీకరించింది అని అర్ధం.
Also Read:లాజిక్ నిజమే… ఆచార్య ఫ్లాప్? ఎలాగో తెలుసా !!
సాధారణంగా సెలబ్రిటీలకు, బాగా ప్రజాదరణ పొందిన వారికి లేదంటే కంపెనీ తరపున అధికారిక ప్రకటనలు చేసేవారికి ఇస్తూ ఉంటారు. సంస్థల తరపున ప్రకటనలు చేయడానికి అధికారిక కంపెనీ ఈమెయిల్ చిరునామాతో పాటుగా… ఇతరుల నుంచి ప్రభుత్వం ఇచ్చిన డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ లాంటి వాటిని ట్విటర్ ధృవీకరిస్తుంది. ఆ తర్వాత మాత్రమే ఆ టిక్ మార్కు మీకు వస్తుంది.
ఫేస్బుక్ కూడా ఇలాగే ధృవీకరించి ఆ టిక్ మార్కును ఇస్తుంది. అలాంటి సౌలభ్యం లేకపోతే అనామకులు కూడా విరాట్ కోహ్లీ, సచిన్, ధోనీ అంటూ పోస్ట్ లు చేస్తారు. అందుకే ఈ సమస్యను బ్లూ టిక్ ద్వారా తొలగించారు. ఈ రేంజ్ లో సోషల్ మీడియా దిగ్గజాలు జాగ్రత్తలు తీసుకున్నా సరే… హ్యాక్ చేసి ఇష్టం వచ్చినవి పోస్ట్ చేస్తారు. బ్లూ టిక్ కోసం కొందరు హీరోయిన్ లు తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు.
Also Read:రూపాయికే లీటర్ పెట్రోల్… ఎక్కడంటే ?