[sonaar_audioplayer artwork_id=”” feed=”https://tolivelugu.com/wp-content/uploads/2022/04/jagan-kcr.mp3″ player_layout=”skin_float_tracklist” hide_progressbar=”default” display_control_artwork=”false” hide_artwork=”false” show_playlist=”false” show_track_market=”false” show_album_market=”false” hide_timeline=”false”][/sonaar_audioplayer]
– ఏపీ కేబినెట్ మార్పుతో వైసీపీలో అసంతృప్తి సెగలు
– జగన్ పై తిరగబడిన సొంత పార్టీ నేతలు
– తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఉంటుందా?
– ఉంటే.. కేసీఆర్ కు షాకులు తప్పవా?
– పదవుల కోసం కాచుక్కూర్చున్న గులాబీలు
– పదవి ఇస్తారా? వెళ్లాలా? అంటూ ఇన్ డైరెక్ట్ హింట్స్
– మరి.. జగన్ చేసిన తప్పును కేసీఆర్ చేస్తారా?
ఈమధ్యే ఏపీ కేబినెట్ ను మార్చేశారు సీఎం జగన్. మొత్తం 25 మందితో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు కూడా ఉత్సాహంగా పనులు మొదలు పెట్టేశారు. అయితే.. చాలామంది నేతలు మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. వారిలో కొందరు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ మార్పు జగన్ కు నష్టాన్నే తెచ్చి పెట్టిందని రాజకీయ పండితులు అనేక విశ్లేషణలు చేస్తున్నారు.
జగన్ లా కేసీఆర్ కూడా కేబినెట్ ను మార్చి ఇబ్బందులు తెచ్చుకుంటారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నిజానికి ఏపీ కేబినెట్ మార్పు కంటే ముందే తెలంగాణ మంత్రి వర్గంపై వార్తలు వచ్చాయి. కానీ.. కేసీఆర్ దానిపై దృష్టే పెట్టలేదు. సంక్రాంతికే కొత్త కేబినెట్ వస్తుందని భావించిగా.. శ్రీరామనవమి దాటినా ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ గ్యాప్ లో జగన్ మంత్రి వర్గాన్ని మార్చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే.. ఆయన చేసిన ఈ మార్పుతో పార్టీలో అసంతృప్తి సెగలు బయటపడ్డాయి.
ఇప్పుడు తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో కేబినెట్ లో మార్పులు చేర్పులు జరిగితే కేసీఆర్ కు షాకుల మీద షాకులు తగలడం ఖాయమని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు. ఎందుకంటే.. జగన్ పాలన మూడేళ్లే. పార్టీలో ఉన్న నాయకులు కూడా చాలా తక్కువే. కానీ.. టీఆర్‌ఎస్ లో అలా కాదు. ఈ 8 ఏళ్లలో ఎవరు వస్తానన్నా రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికారు కేసీఆర్. ప్రతిపక్షమే ఉండకూడదన్న కాన్సెప్ట్ తో ఆయన అలా చేసినా.. చివరకు ఆ తప్పే కేసీఆర్ మెడకు చుట్టుకుందని అంటున్నారు విశ్లేషకులు.
ఇతర పార్టీల నుంచి వచ్చి గులాబీ కండువా కప్పుకున్న చాలామంది నేతలు పదవుల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కొందరు నేతలు మీటింగులు పెట్టుకుంటూ పదవి ఇస్తారా? వెళ్లిపోవాలా? అని కేసీఆర్ కు ఇన్ డైరెక్ట్ హింట్ ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేబినెట్ లో మార్పులు చేస్తే లేనిపోని చిక్కులు రావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు. అయినా.. కేసీఆర్ తీరు చూస్తుంటే.. మంత్రి వర్గ విస్తరణ ఆలోచనే లేదన్నట్టుగా కనిపిస్తోందని అంటున్నారు.
మరోవైపు కేసీఆర్ కేబినెట్ విస్తరణ చేయకపోవడానికి ముందస్తు ఎన్నికలు కూడా ఓ కారణం అయి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ఉండదని ఆయన చెప్పుకున్నా.. ఉద్యోగాల ప్రకటన, ఇతర అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రభుత్వం చేస్తున్న హడావుడి చూస్తుంటే తేడాగానే ఉందంటున్నారు విశ్లేషకులు. ఇలాంటప్పుడు కేబినెట్ ను మార్చడం ఎందుకులే.. ఉన్నవాళ్లతోనే కొన్నాళ్లు నడిపించి ఎన్నికలకు వెళ్దామనే ఆలోచనలోనే కేసీఆర్ ఉన్నట్లుగా చెబుతున్నారు.