బేబీ శాలిని” ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో ఈ పేరు ఒక సంచలనం. ఆమె చేసిన సినిమాలు పోషించిన పాత్రలు బాల నటులు ఎవరూ కూడా చేయలేదు ఏమో. అయితే ఆమె కెరీర్ హీరోయిన్ గా మాత్రం నిలబడలేదు. రెండు షిఫ్టుల్లో ఒక్కో రోజు సినిమాలు చేసిన ఆమె… తన బాల్యం మొత్తం సినిమాలకే కేటాయించింది. అలాంటి శాలిని ఇప్పుడు సినిమాల్లో చిన్న పాత్రల్లో కూడా కనపడటం లేదు.
Also Read: భార్యకు ప్రేమతో.. బావినే తవ్వేశాడు!
ఆమె హీరోయిన్ గా చేయకముందే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. మొదటి సినిమా ఎంపిక విషయంలో ఏ మాత్రం కంగారు లేకుండా చేయాలని… మంచి సినిమా చేయాలని భావించి 2008లో తెలుగులో సిద్ధార్థ సరసన ఓయ్ అనే చిత్రానికి సంతకం చేసి ఆ సినిమాను పూర్తి చేసింది. కథానాయిక ప్రాధాన్యత ఉన్న పాత్రే గాని సినిమా మాత్రం ఆకట్టుకోలేదు. ఫీల్ గుడ్ సినిమాగానే మిగిలిపోయింది.
ఆ సినిమా హిట్ అయితే వరుసగా సినిమాలు చేయాలని లేదంటే అక్కడే ఆగిపోవాలని డిసైడ్ అయింది ఆమె. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో సింగపూర్ వెళ్లి చదువుకుంది. తర్వాత హై-ఫ్లక్స్ అనే కంపెనీలో, తర్వాత ఒక యాడ్ ఏజెన్సీలో పని చేసింది. సినిమాల నుండి తప్పుకున్నట్టు ప్రకటించిన తర్వాత ఆమెను పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆమెకు 27–28 సంవత్సరాలు ఉన్నప్పుడు హీరోయిన్ గా మారింది.
ఇక ఆ తర్వాత విక్రమ్ ప్రభుతో ఒక సినిమా చేసినా అది సక్సెస్ కాలేదు. ఇక సినిమాలు చేసే ఆలోచన వదిలేసి… చెన్నైలో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను చూస్తుంది. మంచి దర్శకుల చేతుల్లో పడటం వల్ల, మంచి కథలు దొరకటం వల్ల అతి చిన్న వయసులోనే అగ్రస్థాయిని అందుకుని ఆ తర్వాత కనపడకుండా పోయింది. ఇప్పుడు చెన్నై లోనే ఉంటుంది. ఉన్నత చదువులు చదివినా సొంత కాళ్ళ మీదనే నిలబడింది.
Advertisements
Also Read: ఈ ఇంగ్లిష్ పదాలను, అక్షరాలను మీరు ఎలా పలుకుతున్నారు…?