రక్తదానం విషయంలో గతంలో భయపడే వారు. అయితే ఇప్పుడు మాత్రం రక్తదానం కోసం స్వచ్చందంగా ముందుకు వస్తున్నారు. ఇక రక్తదానం విషయంలో అవగాహన కల్పిస్తూ ఉండటం కూడా రోగులకు, రక్తం అవసరమైన వారికి ఉపయోగకరంగా ఉంటుంది. పెద్ద ఎత్తున ఇప్పుడు రక్తదాన శిభిరాలు నిర్వహించడం, రాజకీయ నాయకుల అభిమానులు, సినీ హీరోల అభిమానులు ఎక్కువగా ఈ శిభిరాల్లో పాల్గొంటున్నారు.
అయితే పచ్చబొట్టు పోడిపించుకున్న వాళ్ళు ఎంత వరకు రక్తదానం చేయవచ్చు అనే దానిపై అవగాహన లేదు. చాలా ఏళ్ళ వరకూ పచ్చబొట్లు పొడిపించుకున్న వారి దగ్గర రక్తం తీసుకునే వారు కాదు. ప్రధాన కారణం అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉందని భావించి… తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు మాత్రం భయపడకుండా తీసుకోవడం జరుగుతుంది. అయితే ప్రజల్లో మాత్రం దానిపై భయం అలాగే ఉంది.
పచ్చబొట్టు పొడిపించుకున్నవారు కొంత కాలం ఆగి రక్తదానం చేయడానికి అవకాశం ఉంది. నియమాలు ఏంటీ అనేది ఒకసారి చూద్దాం. రెడ్ క్రాస్ వారి నియమాల ప్రకారం ఒక ఏడాది అంటే… 12 నెలలు కనీసం ఆగాలి. అదికూడా ప్రభుత్వ నియత్రింత పచ్చబొట్ల కేంద్రం లో వేయించుకోకపోతే మాత్రం. ఎందుకంటే హెపటైటిస్ వంటివి రాకుండా జాగ్రత్త కోసం ఈ విధంగా చేస్తారు.
అదే ప్రభుత్వ నియత్రింత పచ్చబొట్ల కేంద్రంలో స్టెరైల్ పద్ధతిలో వేస్తే కచ్చితంగా తీసుకుంటారు. చాలా రాష్ట్రాల్లో ఆ నియంత్రణ లేదు కాబట్టి దాదాపు అందరూ ఒక ఏడాది తరువాత రక్తదానం చేయడానికి అవకాశం కల్పించారు. రాష్ట్రీయ ఎయిడ్స్ నియంత్రణ సంఘం వారి నియమాల[2] ప్రకారం 6 నెలలు కనీసం ఆగితే మాత్రమే అవకాశం ఉంది.