కొన్ని కొన్ని విషయాల్లో మన పెద్దలు చెప్పేవి ఆసక్తికరంగా ఉంటాయి. భోజనం చేసే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంబంధించి మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు. ఇక భోజనం చేసే సమయంలో ఒళ్ళు విరవకూడదు అనే విషయాన్ని చాలా మంది దగ్గర వింటాం. అసలు అలా ఎందుకు చేయకూడదు…? చేస్తే కలిగే నష్టాలు ఏంటీ అనేది ఒకసారి చూద్దాం.
భోజనం చేసే సమయంలో చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఉండాలి. ఒళ్ళు విరుచుకుంటే, ఒక అన్నం మెతుకు అయినా సరే లంగ్స్ లోకి వెళ్ళింది అంటే ప్రాణాల మీదకు వస్తుంది. అందుకని భోజనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకోసారి ఉక్కిరిబిక్కిరి అయి మనకు తెలియకుండా మంచినీళ్లు లేదా భోజనం ముక్కు లోకి పోయి ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉంటాం. ఒక్కోసారి మనకు ఊపిరి ఆడదు. ఒకోసారి బాగా ఎక్కిళ్ళు కూడా వస్తాయి.
అందుకే భోజనాల సమయంలో కొన్ని కొన్ని పాటించాలి అంటారు. భోజనం చేసేవేళ మాట్లాడటం కరెక్ట్ కాదు. భోజనము తినే వారికి ఒంటపట్టదు. భోజనం చేస్తూ ఒళ్ళు విరుచుకుంటే గొంతు పడుతుంది. ఆ సమయంలో ఊపిరాడదు. తినేదాని మీద, నమిలి మింగడం మీద శ్రద్ధ పెట్టి తినలేదు అంటే ఒంటపట్టదు. కోపంగా ఎవరినీ తిట్టుకుంటూ తినడం మంచిది కాదు. ముందు మంచినీళ్లు పెట్టి తరువాత భోజనం వడ్డించాలి.