కొరొనా వైరస్ వ్యాపిస్తున్న నేపధ్యంలో వ్యక్తిగత శుభ్రత పరిగి శానిటైజర్ల వాడకం ఎక్కువైంది..ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లు వాడాలి.. అవే ప్రభావవంతంగా పనిచేస్తాయనే ప్రచారం ఎక్కువైంది.. ఆల్కహాల్ అనగానే మనకు తెలిసింది ఒకటే ..దాంతో మద్యం అందుబాటులో లేని వాళ్లు మత్తుకోసం శానిటైజర్లు తాగి ప్రాణాలు కోల్పోతున్నారు.. నిన్నటికి నిన్న పదిమందికి పైగా మరణించడంతో దేశవ్యాప్తంగా సంచలనం అయింది..అసలింతకీ శానిటైజర్ లో ఉన్న ఆల్కహాల్ ఏంటి..దాని వలన మన బాడిలో జరిగే మార్పేంటి..చనిపోవడానికి కారణం ఏంటి అనేది తెలుసుకోండి..
హ్యాండ్ శానిటైజర్లలో సాధారణంగా FDA ఆమోదించబడిన ఆల్కహాల్స్ ఉంటాయి. ఇథనాల్ (ఇథైల్ ఆల్కహాల్), ఐసోప్రొపనాల్ (ఐసోప్రొపైల్ ఆల్కహాల్) లేదా బెంజల్కోనియం క్లోరైడ్ (ఒక డిటర్జెంట్) అనేవి ఉంటాయి. సాధారణంగా బీర్,వైన్ లాంటి వాటిల్లో ఉండే ఆల్కహాల్ కూడా ఇథనాలే..కాకపోతే శానిటైజర్లలో ఉండే ఆల్కహాల్ శాతం మద్యంలో ఉండే దానికంటే ఎక్కువ.
ఇథైల్ ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్స్ తాగడం వల్ల మత్తు వస్తుంది, పరిమాణ ఎక్కువైతే కోమాలోకి వెళ్లవచ్చు. పిల్లలు పొరపాటున శానిటైజర్ నోటిదగ్గరకు తీసుకున్న మూర్చ వస్తుంది..అదే ఇథనాల్ కలిగి ఉన్న శానిటైజర్ పిల్లలకు ప్రమాధమే.కానీ FDA రూల్స్ పాటించకుండా ఇథైల్ ఆల్కహాల్ స్థానంలో మిథనాల్ (మిథైల్ ఆల్కహల్ ) ని ఉపయోగిస్తున్నారు.. ఇది చాలా ప్రమాదకరమైనది..
మిథనాల్ శరీరంలో అనేక రసాయన మార్పులకు గురిచేస్తుంది.. పూర్తి అంధత్వం, మరణానికి కారణం అవుతుంది.ఇది శరీరంలోకి వెళ్లి రక్తంలో చక్కెర నిల్వలను తగ్గిస్తుంది..హార్ట్ బీట్ పడిపోయి,ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. .వెంటనే చికిత్స అందించకపోతే ప్రమాదం.. మనం ఉపయోగించే శానిటైజర్ల లేబుల్స్ పై ఇథనాల్, ఐసోప్రొపనాల్ బెంజల్కోనియం క్లోరైడ్ వాడబడ్డాయి అని చెప్పినప్పటికి వాటిని నమ్మడానికి లేదు..