సినిమాల విషయంలో కొందరికి కొన్ని పాత్రలు అతికినట్టు సరిపోతాయి. నిజానికి వారు నటించిన తర్వాత ఆపాత్రల్లో వారిని తప్ప ఇంకొకర్ని ఊహించుకోలేం.. ఊహించుకున్నా జీర్ణించుకోలేం. చంటి సినిమాకి సంబంధించి అలాంటి ఇంట్రస్టింగ్ విషయం ఒకటి ఉంది.
కమెడియన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు నాట సుస్థిర స్థానం సంపాదించుకున్నారు రాజేంద్ర ప్రసాద్. తొలినాళ్లలో హీరోగా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి నటించడం మొదలు పెట్టిన రోజు నుంచి నేటి వరకు బిజీగానే ఉంటున్నారు.
అయితే ఆయనకు వెంకటేష్ కి మధ్య చాలా కాలం పాటు గ్యాప్ వచ్చిందనే విషయం ఇటీవల బయటకు వచ్చింది.ఇక ఈ ఇద్దరి నటల మధ్య గ్యాప్ వచ్చిందనేది మరో ఇంట్రస్టింగ్ విషయం.
తమిళంలో హిట్ అయిన తంబి అనే సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని భావించి కె.ఎస్. రామారావు గారు డబ్బులు పెట్టి ఆ సినిమా రైట్స్ కొనుక్కున్నారు.ఈ సినిమా సూపర్ హిట్ అయింది తెలుగులో తీస్తే కాసుల వర్షం కురుస్తుందని రామారావు భావించారు.
ఈ సినిమాలో హీరోగా వెంకటేష్ నటించిన తెలుగులో సైతం ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. వాస్తవానికి ఈ వెంకటేష్ సినిమాల్లో ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాగా చంటి చరిత్రలో నిలిచిపోయింది.
ఈ సినిమాకు మొదటగా అనుకున్న హీరో వెంకటేష్ కాదట మొదట ఈ సినిమాను కె.ఎస్.రామారావు రాజేంద్రప్రసాద్ తో తీయాలని అనుకున్నారు. అందుకోసమని రాజేంద్రప్రసాద్ కి కథ చెప్పి ఒప్పించారు కూడా. అయితే అంతా ఓకే అయ్యాక ఈ సినిమా రామానాయుడు కూడా చూడటంతో ఆయనకు బాగా నచ్చిందట.
దాంతో రామానాయుడు,రామారావును పిలిపించి వెంకటేష్ ని హీరో గా పెట్టి చంటి సినిమా తీయాలని కోరారట. అప్పటికే రాజేంద్రప్రసాద్ నీ ఈ సినిమా కోసం ఒప్పించడంతో ఏం చేయాలో పాలుపోక ఆయన్ని పక్కన పెట్టి వెంకటేష్ తో సినిమా తీశాడట రామారావు.
దాంతో రాజేంద్రప్రసాద్ కి వెంకటేష్ కి మధ్య గ్యాప్ వచ్చిందట. కొన్నాళ్లపాటు వీరిద్దరి మధ్య మాటలు కూడా లేవని ఆ మధ్య రాజేంద్రప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఒకవేళ చంటి సినిమా రాజేంద్రప్రసాద్ తీసి ఉంటే ఇంతటి ఘన విజయం సాధించేదా అంటే అనుమానమే ఒకవేళ హిట్ అయి ఉంటే రాజేంద్రప్రసాద్ కెరీర్ మరో లెవెల్ లో ఉండేది.