వన్డే ర్యాంకులను చూస్తే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ కోహ్లీలకు ఏమైందనే సందేహం కలగకమానదు. ఎందుకంటే వీళ్లకన్నా జూనియర్స్ మంచి ఫామ్ లో ఉన్నారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ప్రకారం కోహ్లీ 707 రేటింగ్ పాయింట్లతో 8వ స్థానంలో ఉంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 704 పాయింట్లతో 9 వ స్థానానికి చేరుకున్నాడు.

ఇక ఈ మధ్య కివీస్ సీరిస్ తో తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్న శ్రేయస్ అయ్యర్, శుభమన్ గిల్ లు మంచి ర్యాంకులను సొంతం చేసుకున్నారు. శ్రేయస్ 6 స్థానాలు మెరుగుపర్చుకొని 27వ ర్యాంకు సాధించాడు. గిల్ కూడా అతని దారిలోనే 3 స్థానాలకు ఎగబాకి 34వ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ఇలా ఉంటే.. వన్డే తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ పరిస్థితి కూడా రోహిత్ శర్మ, కోహ్లీలానే తయారైంది. గతంతో పోల్చుకుంటే రెండు స్థానాలు దిగజారి 15 వ స్థానానికి చేరుకున్నాడు.
మరోవైపు వన్డే ర్యాకింగ్స్ లో పాక్ ప్లేయర్లదే హవా నడిచింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ నెంబర్ వన్ పొజిషన్లో ఉంటే.. ఇమామ్ ఉల్ హక్ సెకండ్ ప్లేస్ దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ బ్యాట్స్ మన్స్ కూడా తమ స్థానాలు బాగానే మెరుగుపర్చుకున్నారు. టామ్ లాథమ్ తొలి వన్డేలో సెంచరీ చేసి 18 వ ర్యాంక్ ను దక్కించుకున్నాడు. ఇక విలియమ్స్ 98 బంతుల్లో 94 పరుగులు చేసి టాప్ 10 లో స్థానాన్ని సాధించుకున్నాడు.
ఐసీసీ వన్డే బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్ లిస్ట్ విషయానికొస్తే.. బాబర్ ఆజమ్(పాక్), ఇమామ్ ఉల్ హక్(పాక్), రస్సీ వాన్ డెర్ దస్సెస్(దక్షిణాఫ్రికా), క్వింటర్ డికాక్ (దక్షిణాఫ్రికా), డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా) ప్లేయర్లున్నారు. ఇక్కడ కొసమెరుపేంటంటే.. బౌలింగ్, ఆల్ రౌండర్ల లిస్ట్ లో టాప్ 10లో ఒక్క ఇండియన్ క్రికెటర్ కూడా లేకపోవడం.
ReplyForward |