చూయింగ్ గమ్ మింగితే ప్రమాదం అనే ప్రచారం చాలా ఎక్కువగా ఉంది. చిన్నప్పుడు మనకు తెలియని సమయంలో… ఏడు సంవత్సరాల వరకూ కడుపులోనే ఉంటుందనే ప్రచారం చేస్తూ ఉంటారు. చూయింగ్ గంలు ఎలాస్టిక్ గా ఉంటాయి. వాటిని గమ్ తో తయారు చేయడంతో వాటిని ఎంతగా నమిలినా వాటి పరిమాణం అసలు తగ్గదు. కాకపోతే వాటిని మింగితే ఏదో అనర్థం జరిగిపోతుందనే మాట నిజం కాదు.
బయపడడానికి కారణం మన కడుపులోని ఆమ్లాలు దాన్ని జీర్ణం చేసుకోవాల్సి ఉంటుంది. అది కడుపులోకి వెళ్లిన తర్వాత కూడా ముద్ద మాదిరి ఉంటుంది. ఇతర ఆహార పదార్థాల మాదిరిగానే అది కూడా మన శరీరంలో ప్రయాణం చేసి చివరికి బయటికి వస్తుంది. మనకి మార్కెట్లో అమ్మే చూయింగ్ గమ్ ప్రాణాంతకం కాదు. మనం దాన్ని మింగినా అది మన జీర్ణ వ్యవస్థలో ఎక్కడా కూడా ఇరుక్కుపోకుండా ఉండే విధంగా తయారు చేస్తారు.
అందుకే దాన్ని మనం మింగినా సరే అది సునాయాసంగా గొంతులో నుండి కడుపులోకి వెళ్లి ఆ తర్వాత పేగులలోకి వెళ్తుంది. ఆ తర్వాత బయటకు వస్తుంది యధావిధిగా. అయితే ఎక్కువ మింగితే ప్రాణం పోయినా ఆశ్చర్యం లేదు. కానీ చిన్నపిల్లలు దాన్ని పొరపాటున మింగేస్తే అది చిన్నగా ఉన్నా సరే వాళ్ళ పేగుల్లో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. దాని వల్ల కడుపు నొప్పి, వాంతులు, మలబద్దకం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి తెలిసే వయస్సు వచ్చేవరకు వాటిని చిన్నపిల్లల నుండి దూరంగా ఉంచాలి.