మన ఇండియాలో కొన్ని కొన్ని సమస్యలు ఎక్కువ… కొందరు తుమ్మడాన్ని, కింద నుంచి గాలి వదలడాన్ని అవమానంగా భావిస్తూ ఉంటారు. పక్కన వాళ్ళు వెకిలి నవ్వులు కూడా దీనికి కారణం అనే చెప్పాలి. ఇక తుమ్మడం ఆపితే మాత్రం లేనిపోని సమస్యలు వస్తూ ఉంటాయి అనేది చాలా మందికి తెలియదు.
Also Read: బీజేపీ మౌనం వెనుక..22 కోట్లు! ఆర్ఎస్ ప్రవీణ్ సంచలనం
తుమ్ము వేగం గంటకి 185కి.మీ లు. అంటే గంటకు వంద మైళ్ళ వేగంతో బయటకు వస్తుందనే విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది వచ్చినప్పుడు ఆపుకుంటే అది రివర్స్ లో లోపలి వెళ్లి గొంతులో కొన్ని సున్నితమైన భాగాలు దెబ్బ తింటాయి. ఈ విషయం తెలియక కొందరు తుమ్ము వస్తే ఆపుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళే ముందు తుమ్మితే ఆమ్మో దరిద్రం అని భయపడతారు.
ఇలా ఆపుకున్న వారికి గొంతు సమస్య రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సిగ్గుతో మనం తుమ్మును బలవంతంగా ఆపితే మెదడులోని రక్త నాళాలు కూడా పగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తుమ్ములోని గాలి బుడగలు గుండె, మెదడు కణజాలాల్లో వెళ్ళడం ద్వారా ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. చిన్న పిల్లలు తుమ్మిన సమయంలో కొందరు చిరంజీవ అంటూ ఉంటారు. వాస్తవానికి తుమ్ము పునర్జన్మ లాంటిది. కొందరు దేవుళ్ళ పేర్లు కూడా తలుస్తూ ఉంటారు. కారణం మళ్ళీ మాకు జన్మను ప్రసాదించావని అర్ధం.
Advertisements
Also Read: యాంకర్ సుమ కెరీర్ సీక్రెట్ ఏంటీ…? ఆమెకు ప్లస్ పాయింట్ ఏంటీ…?