సాధారణ రోడ్ల మీద డ్రైవింగ్ కంటే కూడా ఘాట్ రోడ్ల మీద డ్రైవింగ్ అనేది ఒక సవాల్ గా ఉంటుంది. ట్రాఫిక్ రూల్స్ పాటించలేదు అంటే మాత్రం ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. ఘాట్ రోడ్ మీద జర్నీ చేయాలి అంటే అనుభవం ఎక్కువగా ఉండాలి. ఇక ఘాట్ రోడ్ లో ప్రయాణం చేసే వారు గుతున్చుకోవాల్సిన విషయాలు ఏంటో ఒకసారి చూద్దాం.
Also Read:రేవంత్ పిలుపు.. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం!
మీరు జర్నీ చెయ్య బోతున్న వాహనం కండిషన్ ముందు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. టైర్ లు వాటి లో గాలి చెక్ చేసుకుని పాతది అయితే మార్చుకోవాలి. డ్రైవింగ్ లో ఫండమెంటల్ రూల్ … ఏ గేర్ లో ఘాట్ ఎక్కుతారో అదే గేర్ లో ఘాట్ క్రిందకు దిగడానికి ప్రయత్నం చేయాలి. అయితే క్యాబ్ డ్రైవర్స్ చాలా మంది… ఫ్యూయల్ పొదుపు చెయ్యడానికి న్యూట్రల్ లో ఘాట్ దిగే ప్రయత్నం చేస్తారు. మనం ఎప్పుడూ ఆ పని చేయడం కరెక్ట్ కాదు.
ఇక బ్రేక్ మీద కాలు వేసి నొక్కుతూ నే ఘాట్ దిగడానికి ప్రయత్నం చేస్తారు. అసలు ఆ విధంగా అలా చేయకూడదు. బ్రేక్ డ్రమ్స్ వేడి ఎక్కి మొత్తం బ్రేకింగ్ మేకానిజం ఫెయిల్అయ్యే అవకాశాలు ఎక్కువ. క్లచ్ బ్రేక్ ఒక సారి ఉపయోగించడం మంచిది. వాహనం న్యూట్రల్ లో కి మారి వేగం మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయి. రోడ్డు మీద ఎదురుగా వచ్చే వాహనాలకు దారి వదలడానికి రోడ్డు మార్జిన్ వదిలి బాగా పక్కకు రావాల్సి ఉంటుంది.
డ్రైవింగ్ సరదా వున్న కూడా డ్రైవింగ్ చేసే వారికి ఓపిక, సహనం ఉండాలి. సీట్ బెల్ట్ డ్రైవర్ తో పాటుగా ఇతరులు కూడా పెట్టుకోవాలి. మంచు లేదా వర్షం ఉన్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఘాట్ ఎక్కే సమయంలో వర్షం పడుతుంటే మాత్రం బండి మీద కంట్రోల్ ఎక్కువగా ఉండాలి.
Also Read:ఆస్తమా బారిన చిన్నారులు… ఆందోళన కలిగిస్తున్న నాసా అధ్యయనం