గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే వచ్చేస్తుంది. గతంలో నడి వయస్కుల వారికి వచ్చే సమస్య ఇది. కాని 20 ఏళ్ళు రాకుండానే గ్యాస్ నొప్పితో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. గుండెపోటు ప్రమాదం కూడా ఈ నొప్పితో తెలియడం లేదంటే నమ్మండి. మనం తినే ఆహారం పద్దతిగా తినకపోయినా ఏది పడితే అది తింటున్నా ఈ సమస్య వస్తుంది.
ఇక గ్యాస్ట్రిక్ సమస్య రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి…? ఎలా ఉండాలి అనేది మనం నిత్యం ఎక్కడో ఒక చోట చదువుతూనే ఉంటాం. ఇక గ్యాస్ట్రిక్ సమస్య ఉంటే నిమ్మరసం తాగావచ్చా అనేది చాలా మందికి క్లారిటీ లేదు. ఆ విషయంలో ఏ అనుమానం అవసరం లేదు. చక్కగా తాగేయొచ్చు.
మన శరీరం నిజంగా ఒక అద్భుతం అనే చెప్పాలి. మాములుగా చెప్పాలి అంటే నిమ్మరసం ఆసిడ్ (ఆస్కార్బిక్ యాసిడ్) అన్నట్టు. అది ఎప్పుడైతే లాలాజలంతో కల్స్తుందో గంటలోపే క్షార స్వభావం సంతరించుకుంటుంది నిమ్మరసం. అదే విధంగా పొట్టలోపల ఉండే కండరాలకు క్షార వాతావరణాన్ని కూడా కలుగజేస్తుంది. ఏ సందేహం లేకుండా ఎసిడిటితో గ్యాస్ట్రిక్ తో ఇబ్బంది పడే వాళ్ళు నిమ్మరసం తీసుకోవచ్చు. అయితే చప్పరిస్తూ తాగితే మంచిది.