ఎక్కువ నీరు తాగితే మన ఆరోగ్యానికి మంచిది అనే సలహాలు ఇస్తారు కొందరు. అందుకే కొందరు ఇష్టం వచ్చినట్టు నీళ్లు తాగుతారు. ఇది అనవసర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అసలు ఏం జరుగుతుంది ఏంటీ అనేది ఒకసారి చూద్దాం. ఎక్కువగా నీరు తాగడం వల్ల మన కిడ్నీలు ఎక్కువగా పని చేయాల్సిన పరిస్తితి ఎదురు అవుతూ ఉంటుంది. దానితో కిడ్నీలు తొందరగా చెడిపోయే అవకాశం ఎక్కువ. అందుకె రోజుకు 3,4 లీటర్ల నీటిని తాగడమే మంచిది.
అదే విధంగా వాటర్ పాయిజనింగ్ కూడా అవుతుంది. క్రమంగా సోడియం లెవెల్స్ పడిపోతాయి. దాని వల్ల వాంతులుకావడం , తల తిరగడం వంటివి జరుగుతాయి. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ఎలక్ట్రోలైట్స్ కూడా తక్కువ అయ్యి కణాలు ఉబ్బే అవకాశం ఉంటుంది. కిడ్నీలకి పని ఎక్కువయ్యి తద్వారా శరీరం కూడా అలసిపోయే సూచనలు ఉంటాయి. రోజు పొద్దున్న ఒక లీటర్ నీళ్లు గోరు వెచ్చగా కొంచెం నిమ్మరసం, తేనె తో తాగాలి.
మధ్యాహ్నం లంచ్ తరవాత ఒక గంట సమయం తీసుకుని కొంచెం కొంచెం గా ఒక లీటర్ నీళ్లు తాగాలి. ఇంక రాత్రి పడుకోబోయే లోపు ఇంకో లీటర్ తాగాలి. అంటే మొత్తం మూడు నుంచి నాలుగు లీటర్లు తాగాలి. కొంత మందికి 3 లీటర్లు తీసుకుంటేనే నీరు విష ప్రభావం చూపిస్తుంది. అదే విధంగా ఒక వారం పాటు ఏమీ తినకపోతే నీరు మాత్రమే తాగితే శరీరం అవసరమైన కీలకమైన పోషకాలను కోల్పోతుంది. స్వల్పకాలిక ఫలితం ఏమిటంటే మీరు చాలా బరువు కోల్పోయే అవకాశాలు ఎక్కువ.