ఈ రోజుల్లో మైదా పిండి తో చేసే ఆహార పదార్ధాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అది పూరి అయినా, మైసూరు బజ్జీ అయినా సరే వాటిని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అవి తింటే ఎక్కువగా ఆకలి కాకపోవడమే ప్రధాన కారణం. అందుకే మార్కెటింగ్ జాబ్ చేసే వాళ్ళు రోజు ప్రయాణాలు చేసే వాళ్ళు మైదా పిండి తో చేసే ఆహార పదార్ధాలు ఎక్కువగా తింటారు. అయితే వీటి తో ఆరోగ్యం ఎక్కువగా నష్టపోతుంది.
Also Read:ఉల్లిపాయలు తింటే చెమట వాసన వస్తుందా…? ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి…?
అసలు మైదా పిండి తో చేసే ఆహార పదార్ధాలు చాలా ప్రమాదం. ఫస్ట్ మైదా ఎలా తయారు చేస్తారో తెలుసుకోవడం మంచిది. గోధుమ పిండి ని అలాక్సాన్ అనే కెమికల్ ఉపయోగించి కడగడం ద్వారా గోధుమ పిండిలో ఉన్న కొంత మొత్తం ఫైబర్ వెళ్లిపోతుంది. ఆ తర్వాత తెల్లగా ఉన్న మైదా బయటకు వస్తుంది. అలాక్సన్ కెమికల్ అనేది క్లోమగ్రంధి లోని బేటా సేల్స్ ను నాశనం చేస్తుంది.
క్లోమగ్రంధి లోని beta cells అనేది శరీరంలోని చక్కెర స్థాయిలను ఎక్కువగా నియాంత్రిస్తూ ఉంటాయి. అందుకె మైదాతో చేసిన వంటకాలు తినడం వల్ల త్వరగా త్వరగా మధుమేహం బారినపడే అవకాశాలు ఉన్నాయి. మైదాతో చేసిన వంటకాలు తినక పోవడమే మంచిది. ఆకలి వేయకుండా తినే ఆహార పధార్ధాలతో రోగ నిరోధక శక్తి ప్రధానంగా దెబ్బ తినే అవకాశం ఉంటుంది.
Also Read:నారాయణపేట పచ్చబడుతుంటే.. కొందరి కళ్లు ఎర్రబడుతున్నాయి..!