గత పదేళ్ళ కాలంలో యువత ఎక్కువగా మద్యానికి బానిస అవుతూ వస్తున్నారు.. ప్రస్తుతం కొందరు మద్యం అలవాటు నుంచి క్రమంగా మారుతుంటే మరికొందరు మాత్రం ఆ అలవాటుతో జీవితాన్ని అన్ని విధాలుగా నాశనం చేసుకుంటున్నారు. అసలు మద్యం తాగినప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుంది ఏంటీ అనేది ఒకసారి చూద్దాం.
Also Read:పెళ్లికి ముందుకు అల్లు అర్జున్ ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
ఆల్కహాలు జీర్ణాశయం నుండి శోషించబడి కాలేయం వరకు చేరుకుంటుంది. అక్కడి నుండి శరీరం అంతా చేరుకొని తన పని మొదలు పెడుతుంది. ముఖ్యంగా ఆల్కాహాల్ మెదడు నుంచి చేరినప్పుడు రెండు రకాల పనులు మొదలు పెడుతుంది. ఒకటి మెదడు ని వేగంగా మొద్దు బరుస్తుంది. ఆ తర్వాత ఒకరకమైన ఉత్తేజాన్ని మనలో కలిగిస్తుంది. మొదటి పని వలన మత్తు, నడకలో తేడా, మాట మార్పు మొదలైనవి వస్తు ఉంటాయి.
ఇక రెండో పని వలన ఎక్కువ మాట్లాడటం, భయం తగ్గడం, ఇంకా తాగాలి అనిపించడం, కోరికలు పెరగడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇకపోతే శరీరంలో ని ఆల్కహాలు కాలేయం లో ఎసి టాల్ది హైడ్ గా మారి తర్వాత కొవ్వుగా మారి నిల్వ ఉంటుంది. చాలా కొద్ది శాతం ఆల్కహాలు శ్వాస ద్వారా బయటకు వెళ్తుంది. ఆల్కహాలు తాగేవారు అందుకే బరువెక్కుతారు. ఆల్కహాలు ఒకరకంగా విషం అన్నమాట. అందువలన ఐదు పదేళ్ల తర్వాత కాలేయం, మెదడు, జీర్ణాశయం, కండరాలు, మూత్రపిండాలు, రక్తం, ఎముకలు, వృషణాలు కూడా పాడవుతాయి.
Also Read:మరో పరువు హత్య.. రాజాసింగ్ ఫైర్..!