ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఏది ఎలా తినాలి, ఏది ఎప్పుడు తినాలి అనేది తెలుసుకోవాలి. ఆరోగ్యం పరంగా తలెత్తే సమస్యలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా తినాల్సి ఉంటుంది. పొట్ల కాయ, పప్పు కలిపి తినకూడదు అని కోడి గుడ్డు, పొట్లకాయ తింటే మంచిది కాదని చెప్తారు. అందుకే ఆ రెండు కాంబినేషన్లు మనం ఎప్పుడూ వినలేదు, చూడలేదు, తినలేదు కూడా.
అసలు ఆ రెండు ఎందుకు కలిపి తినకూడదు…? కాకరకాయ – కోడిగుడ్డు, పొట్లకాయ – కోడిగుడ్డు కూరలు ఒకసారి ఎందుకు తినకూడదు అనేది చూద్దాం. ఆయుర్వేద వైద్యం ప్రకారం చూస్తే… పిత్త శ్లేష్మం ఎక్కువగా కలిగించేవి కోడిగుడ్లు. కాస్త ఇంగ్లీష్ లో చెప్పాలంటే… వాటిలో ఉన్న అవిడిన్ లైసోజోమ్ లాంటి కెమికల్స్ మన శరీరంలో ఎమినో ఆసిడ్ తత్వాలను విడుదల చేయడం జరుగుతుంది.
ఇక పోట్ల, కాకర వంటి కూరల్లో రిబోఫ్లావిన్, నియాసిన్ లాంటి రసాయనాలు మన మెటబాలిజం ని వేగవంతం చేస్తాయి. అదే విధంగా డైజెషన్ ని రేగులట్ చేసే హార్మోన్స్. ఇవి పరస్పరం విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉంటాయి. దీనిలో మనలోని కెమికల్ కంపోసిషన్ గతి తప్పి రివర్స్ ఫంక్షనింగ్ గా పని చేయడం మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్యంగా ఉన్న వాళ్లకు ఏ సమస్య రాదు గాని… రోగ నిరోధక శక్తి ఉన్న వాళ్లకు అయితే సమస్య పెరిగి… పుండ్లు, దద్దుర్లు లాంటి ఎఫెక్ట్స్ కనిపిస్తాయి.