పెట్రోల్ బంకు కి వెళ్ళిన సమయంలో మనం జాగ్రత్తగా ఉండకపోతే లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సిగరెట్ కాల్చడం, ఫోన్ మాట్లాడటం వంటి వాటికి దూరంగా లేకపోతే ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. పెట్రోల్ బంకు లో ఫోన్ మాట్లాడితే కాలిపోవడం వంటివి జరుగుతున్నాయి.
Also Read:ఏపీ పాలిటిక్స్ లో పెగాసెస్.. స్పీకర్ కు లేఖ
అసలు అలా ఎందుకు జరుగుతుందో చూస్తే… ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో పెట్రోలు బంకుల్లో పెట్రోలు నింపేటప్పుడు మొబైల్ ఫోన్ వాడడంపై నిషేధం కూడా విధించారు. ఫోన్ కాల్ వచ్చినప్పుడు వెలువడే కొన్ని విద్యుదయస్కాంత తరంగాల శక్తి వలన మంటలు రావొచ్చు. ఏదంటే స్థిర విద్యుత్ (స్టాటిక్)తో పెట్రోలు ఆవిరి అంటుకొని మండే ప్రమాదం ఉందని నిషేధం విధించారు.
అయితే ఇప్పటి వరకు ఇది శాస్త్రీయంగా ఋజువు కాలేదు గాని ప్రమాదాలు అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రతి పెట్రోలు బంకులోనూ క్రెడిట్ కార్డు స్వైపింగ్ యంత్రాలు కూడా వాడుతున్నారు. వాటితో ఎక్కడా కూడా ప్రమాదాలు జరిగినట్టుగా వార్తలు రాలేదు. బంకులో మొబైల్ వాడితే పెట్రోలు మండిపోయే సంభావ్యతకన్నా వ్యక్తిగత ప్రమాదాలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాడకుండా ఉండటం మంచిది. వాడితే జరిమానాలు కూడా కట్టాలి మరి.
Also Read:అర్ధరాత్రి.. ఢిల్లీ రోడ్లపై యువకుడి పరుగు.. ఏం జరిగింది!!