రాహుల్ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంలో కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. రాహుల్ గాంధీకి సంఘీభావంగా కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడి రాజీనామాలకు వెళ్లాలని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ ‘రాజీనామా ఉద్యమం’లో చేరాలని కోరారు.
ప్రజాస్వామ్యం చచ్చి పోయిందని నిరూపించడానికి రాహుల్ గాంధీకి సంఘీభావంగా కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తే ఎలా ఉంటుందని ఆయన అడిగారు. ఆపై ప్రతిపక్షాలన్నీ రాజీనామాల ఉద్యమంలో పాల్గొనలన్నారు.
ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని చెప్పే వారందరికీ ఇది మంచి క్యారెక్టర్ టెస్ట్ అవుతుందని ఆయన ట్వీట్ చేశారు. తాము రాహుల్ భాగస్వాములుగా ముద్రపడనందుకు మొత్తం ప్రతిపక్షాలు సంతోషంగా ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. మొత్తం ప్రతిపక్షాలను బీజేపీ ఏకం చేసిందన్న సంజయ్ ఝా వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
మొత్తం ప్రతిపక్షాలు ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాయన్నారు. ఇప్పుడు వారు రాహుల్ భాగస్వాములుగా ముద్రించబడరని చెప్పారు. దీని గురించి వారు ఏమీ చేయలేరని తెలిపారు. కొందరు సంబురాలు చేసుకుంటున్నాురని వెల్లడించారు. వారి ఫోటోలు త్వరలో లీక్ కావచ్చన్నారు.