కోమా” ఒక మనిషి జీవితంలో అత్యంత దుర్భరమైన స్థితి. దాని కంటే ఒకరకంగా చావు నయం అనే చెప్పాలి. అపస్మారక స్థితిలో రోజుల తరబడి ఉండటమే కోమా. మెదడు యాక్టివ్ గా లేకపోవడం అలాగే బతికే ఉన్నా లేవలేకపోవడం వంటివి కోమాలో ఉంటాయి. వారు ఏ విధమైన సైగలను చేయడం గాని మాట్లాడటం గాని చేయలేరు. కళ్ళు మూసుకుపోయి తమ చుట్టూ ఏం జరుగుతుందో కూడా గ్రహించలేని స్థితిలో ఉంటారు.
కోమాలో ఉన్న వ్యక్తులు నొప్పి లేదా పెద్ద పెద్ద శబ్దాలకు కూడా స్పందించే అవకాశం ఉండదు. వారికి వారుగా మాట్లాడటం గాని చూడటం గాని చేయలేరు. ఇక ఆహారం తీసుకునే చర్యలు గాని మింగడం గాని సాధ్యం కాదు. కొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటె మరికొందరు మెషిన్ సహాయంతో ఆక్సిజన్ తీసుకుంటారు. కోమా సాధారణంగా కొన్ని వారాలు మాత్రమే ఉంటుంది.
ఈ సమయంలో వ్యక్తి క్రమంగా కోమా నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాస్తో కూస్తో స్పృహ ఉండే స్టేజి నుంచి పూర్తిగా అపస్మారక స్థితికి చేరుకుంటారు కొందరు. ఈ దశలో కనీసం వాళ్లకు ఆహారం కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. ఇందులో రెండు దశలు ఉంటాయి. ఒకటి vegetative state – ఇక్కడ వ్యక్తి మేల్కొనే ఉంటాడు గాని తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం లేదు. minimally conscious state – ఇక్కడ ఒక వ్యక్తికి పరిమిత అవగాహన ఉంటుంది. ఈ దశ నుంచి కొందరు బయటకు త్వరగా వస్తే మరికొందరికి ఏళ్ళ పాటు బయటకు రాలేరు.