సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు మనకు కొత్తగా ఉంటున్నాయి. అలాంటిదే ఒకటి పాడ్ కాష్ట్. మన తెలుగులో ఇవి చేసే వాళ్ళ సంఖ్య కాస్త తక్కువే. పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు చేసేవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఈ పాడ్ కాస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం.
Also Read:సిద్దూ హత్య కేసులో ఇద్దరు ప్రధాన షూటర్ల అరెస్ట్
అసలు పాడ్ కాస్ట్ అంటే… శ్రవణ రూపంలో ఉన్న బ్లాగ్. యాప్స్ లో పాడ్కాస్ట్ లను హోస్ట్ చేయవచ్చు. అలాగే వాటిని వినడం కుదురుతుంది. పాడ్ కాస్ట్ లను యాపిల్ ఐట్యూన్స్, గూగుల్ పాడ్కాస్ట్స్, వింక్ మ్యూజిక్ లాంటి వాటిల్లో వినొచ్చు. పాడ్కాస్ట్లతో సౌలభ్యం ఏంటంటే పాటల మాదిరిగానే వినే సౌకర్యం ఉంటుంది. కారు నడుపుతూనో లేదా బండి నడుపుతూనో వినే సౌకర్యం ఉంటుంది.
ఈ పాడ్ కాస్ట్ లు ఇప్పుడు కాస్త జనాలకు దగ్గర అయ్యాయి గాని దాదాపు 15 ఏళ్ళ నుంచి అవి మనకు విదేశాల్లో. అయితే వాటిని ఎక్కువగా రేడియో మాదిరిగా… వినడానికి ఇష్టపడుతూ ఉంటారు. పాడ్ కాస్ట్ చేసే వాళ్ళు… ఇప్పుడు తక్కువ సమయం ఉండే విధంగా చూస్తున్నారు. ఒకప్పుడు కనీసం 30 నిమిషాలు అయినా ఉండే విధంగా చూస్తున్నారు.
ఒక పాడ్ కాస్ట్ కారులో ఆన్ చేస్తే ఆఫీస్ కు వెళ్ళే సమయం గాని ఇంటికి వచ్చే సమయం గాని 30 నిమిషాలకు సరిపోతుంది. అందుకే అంత సమయం ఉండే విధంగా చూసే వాళ్ళు. పాడ్ కాస్ట్ లను ఇప్పుడు జనాలు ఎక్కువగా వినడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద పాడ్ కాస్ట్ లు కూడా ఉంటున్నాయి. కొంతమంది స్టార్ పాడ్కాస్టర్ల ఎపిసోడ్స్ 2-3 గంటలు కూడా ఉంటాయి. అమిత్ వర్మ, జో రోగన్, టిమ్ ఫెర్రిస్ మొదలైన వాళ్ళు పెద్ద పెద్దవి చేస్తారు.
Also Read:ఆ పరిజ్ఞానం అశాస్త్రీయమనడం సరికాదు…!