బ్యాంకు లో డబ్బు డిపాజిట్ చేయడం విషయంలో మనకు ఒక అవగాహన ఉండాలి. లేదంటే మాత్రం కచ్చితంగా నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. బ్యాంకు లో డబ్బులు దాచాలి అనుకున్న వాళ్ళు కచ్చితంగా తెలుసుకోవలసింది రీకరింగ్ డిపాజిట్ గురించి. చాలా మందికి తెలియని విషయం ఏంటీ అంటే ఫిక్సిడ్ డిపాజిట్ కంటే దీనికి ఎక్కువ వడ్డీ వస్తుంది.
మన అకౌంట్ లో బ్యాంకు లో నెల నెలా ఒక ఫిక్సిడ్ అమౌంట్ ను జమ చేయడమే రీకరింగ్ డిపాజిట్. దీని వ్యవధి మామూలుగా ఒక సంవత్సరం (12 నెలలు) పాటు ఉంటుంది. వడ్డీరేటు సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటు కంటే కొద్దిగా ఎక్కువ. డబ్బు పొదుపు చేయడానికి ఇది అత్యంత సురక్షితమైన మార్గం. మనని డబ్బులు పొదుపు చేయడానికి ప్రోత్సహించే ఒక ఉపాయం. మనం నెలనెలా కట్టే డబ్బుకు వడ్డీ చేరుతుందంటే మనకు ఉత్సాహంగా ఉంటుంది.
బయట ఎవరినో నమ్ముకుని చీటీ ద్వారా పొదుపు చేసే డబ్బుకు భద్రత ఏ మాత్రం ఉండదు. కాని బ్యాంకులో చేసే రీకరింగ్ డిపాజిట్ కు భద్రత ఎక్కువ. వచ్చే ఏడాది ఏదైనా అవసరానికి డబ్బు భద్రపరుచుకోవాలంటే మాత్రం ఈ ఏడాది నుండే బ్యాంకులో ఒక ఆర్దీ మొదలు పెట్టాలి. బంగారం దుకాణలలో, బట్టల దుకాణాలలో మనం పదకొండు నెలలు డబ్బు కడితే పన్నెండో నెల దుకాణం వారే కట్టి మనకు అంత డబ్బుకు వారి దుకాణం లోని వస్తువును ఇవ్వడం జరుగుతుంది గాని అలా కట్టిన డబ్బుపై మనకు అధికారం తక్కువ. కానీ ఆర్దీ చేసిన డబ్బుపై మనకు అధికారం ఉంటుంది.