క్రికెట్ ఆడే సమయంలో రూల్స్ గురించి అవగాహన లేకపోతే జట్టు ఓటమికి కూడా కారణం అవుతుంది. ఏ సందర్భంలో ఎలా వ్యవహరించాలి అనేది కూడా కీలకం అనే చెప్పాలి. ఇక క్రికెట్ లో బ్యాటింగ్ చేసే సమయంలో బౌలింగ్ చేసే సమయంలో జాగ్రత్తగా రూల్స్ తెలుసుకుని మసులుకోకపోతే పరుగులు ఎక్కువగా పోయే అవకాశం ఉంటుంది.
బ్యాట్స్మెన్ అయినా బౌలర్ అయినా సరే తీసి ప్రతీ పరుగు, వేసే ప్రతీ బంతి పూర్తి అవగాహనతో ఉండే ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక క్రికెట్ లో షార్ట్ రన్ అనేది ఒకటి ఉంటుంది. దాని గురించి చాలా మందికి అవగాహన లేదు. ఇది క్రికెట్ లో విజయాలను సైతం దూరం చేసిన పరుగు. అసలు ఏంటీ అంటే… క్రికెట్ లో ఒక పరుగు పూర్తి చేయాలంటే ఆడుతున్న ఇద్దరు బ్యాట్స్మెన్లు కూడా ఎదురుగా ఉండే క్రీజ్ ను బ్యాట్ తో లేదా కాలుతో లేదా ఎలా అయినా సరే తాకాలి.
Also Read: తెలుగు సినిమాలో పాపులారిటీకి దూరంగా, ఆఫర్లకు దగ్గరగా ఉండే ముగ్గురు నటులు…!
Advertisements
అలా తాకినా లేదా దాటినా సరే దాన్ని పరుగుగా లెక్కిస్తారు. అలా కాకుండా ఇలా దాటకుండా లేదా క్రీజ్ ను బ్యాటుతో తాకలేకపోయినా సరే అది షార్ట్ రన్ అవుతుంది. వేగంగా రెండు లేదా మూడు పరుగులు పూర్తి చేయాలనే ఆతృతలో ఆటగాళ్ళు ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. మామూలుగా వేగంగా రెండవ పరుగు పూర్తి చేయాలనే ఉద్దేశంతో బ్యాట్స్మెన్ ఇలా చేస్తూ ఉంటారు. ఒకసారి విరాట్ కోహ్లీ ఇదే విధంగా పరుగు లాస్ అయ్యాడు.