ఈ రోజుల్లో మనం ఎక్కువగా కష్టపడుతూ ఆకలిని కూడా మర్చిపోతున్నాం. ఎంత సంపాదించినా కడుపుకి తినడానికే అనే విషయాన్ని చాలా మంది మర్చిపోతున్నారు. ఇక ఆకలి ఎక్కువగా ఉండకుండా కంట్రోల్ చేసుకోవడానికి ఏం ఆహారం తింటే మంచిది ఏంటీ అనేది ఒకసారి చూద్దాం. ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహరం ఆకలి అణిచివేయడంలో మనకు బాగా హెల్ప్ అవుతుంది.
Also Read:పంచాయతీ సెక్రటరీపై కత్తులతో దాడి..!
అందులో యాపిల్ ముందు వరుసలో ఉంటుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండే ఫలం యాపిల్. ఇందులో ఉండే ఫైబర్ మూలంగా కడుపు నిండినట్టు ఫీల్ వస్తుంది. అల్లం కూడా మనకు ఆకలిని కంట్రోల్ చేస్తుంది. జొన్నలు/సజ్జలు కూడా మనకు ఆకలిని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతాయి. వీటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. నీటిని పీల్చుకోవడమే కాకుండా జీర్ణక్రియ సమయంలో వాల్యూమ్‌ను కూడా పెంచుతుంది.
పెరుగు /మజ్జిగ కూడా ఆకలిని కంట్రోల్ చేస్తాయి. పెరుగు రోగనిరోధక శక్తిని ఎక్కువగా పెంచుతుంది. వ్యాధులతో పోరాడటానికి ఇది హెల్ప్ అవుతుంది. అలాగే బరువు కూడా తగ్గడానికి బాగుంటుంది. మజ్జిగను నీళ్లకు బదులుగా వాడడం మంచిది. గుడ్లు తింటే ఇంకా మంచిది. ఇవి మంచి ప్రోటీన్ ఉన్న ఆహరం అని చెప్పాలి. తెల్ల సొనలో 90 శాతం ప్రోటీన్ ఉంటుంది . డార్క్ చాకోలెట్స్ తిన్నా సరే మనకు ఆకలి కంట్రోల్ అవుతుంది. 70% డార్క్ చాక్లెట్ మీ జీర్ణక్రియ ప్రక్రియను కంట్రోల్ చేస్తుంది. చూయింగ్ గుమ్ తిన్నా సరే ఆకలిని ఆపుకోవచ్చు. బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇక గ్రీన్ టీ, బాదం వంటివి కూడా మనకు మంచి చేస్తాయి.