క్యాన్సర్ పేరు వింటే కొందరికి గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి. క్యాన్సర్ నుంచి బయట పడటానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తారు. అసలు క్యాన్సర్ అంటే ఏంటీ…? అది ఎందుకు అంత ప్రమాదమో చూద్దాం. పూర్వం క్యాన్సర్ పేరుని మన తెలుగులో రాచ పుండు అని అంటారు. మనిషి శరీరంలో కణాలు పుడుతూ చనిపోతాయి. ఆ విధంగా చనిపోయేవి అనూహ్యంగా పెరిగి ఒక గుంపుగా మారి శరీరంలో ఒక అవయవం నుంచి మరో అవయవానికి పాకి శరీరం మొత్తాన్ని నాశనం చేస్తాయి.
Also Read:ఆర్మీ డ్రైవింగ్ శిక్షణ ఇంత కఠినంగా ఉంటుందా…? ఆ గ్లాస్ లో నీళ్ళు ఒలికితే లైసెన్స్ ఇవ్వరా…?
అలా గుంపుగా ఏర్పడటాన్ని కాలని అని పిలుస్తారు. అవి రాచపుండు గా బయటకు వస్తు ఉంటాయి. దానిని ఇప్పుడు క్యాన్సర్ అని పిలుస్తున్నాం. శరీరం వాటి మీద పెద్ద ఎత్తున యుద్ధం చేస్తుంది. దీనితో తెల్ల రక్తకణాలు పెరుగుతాయి భారీగా. ఆపరేషన్ ద్వారా, కీమో ద్వారా క్యూర్ చేస్తారు. కాలనైజ్ అయిన కణాలు ఆ అవయవాన్ని నాశనం చేస్తే దాన్ని తొలగించేస్తారు. మన శరీరంలో ఏదైనా ఒక అవయవం ఎక్కువ సుఖపడుతుంటే అంటే ఎక్కువ వ్యాయామం లేకపోతే ఆ భాగానికి క్యాన్సర్ వస్తుంది.
కొన్ని అవయవాల్లో ఏదైనా పదునుగా ఉండే వస్తువులు గుచ్చుకుంటే… మన శరీరంలో కొత్త కణజాలం పెరుగుదలపై నియంత్రణ ఉండదు. బ్రెస్ట్ క్యాన్సర్ లో ఇది ఎక్కువగా జరుగుతుంది. ఇలా బ్లడ్ కాన్సర్ విషయంలో కూడా జరుగుతుంది. మంచి ఆహారం, మంచి ఆలోచన, మంచి వ్యాయామం ద్వారా శరీరాన్ని ఒక మంచి రక్షణ వ్యవస్థగా తయారు చేసుకోవచ్చు. క్యాన్సర్ విషయంలో మంచి అవగాహన పెంచుకుంటే క్యాన్సర్ నుంచి బయట పడవచ్చు.
Also Read:చేదు జ్ఞాపకాలు.. తెలిస్తే షాకవుతారు!