కాలు ఒక చోట పెట్టి కదలకుండా అలా కూర్చుంటే అది తర్వాత తిమ్మిరిగా ఉండి కనీసం అయిదు నిమిషాల పాటు సమయం పడుతుంది. అసలు ఈ తిమ్మిరి ఎక్కడమం అంటే ఏంటీ…? తిమ్మిరి ఎందుకు ఎక్కుతుంది అనేది చాలా మందికి అవగాహన లేదు. కాని తిమ్మిరి ఎక్కినప్పుడు మనకు ఆ ప్రదేశంలో స్పర్శ ఉండదు.
Also Read:రసూల్‌పురాలో 45 రోజులు కొనసాగనున్న ట్రాఫిక్ ఆంక్షలు
అసలు తిమ్మిరి అంటే ఏంటో చూద్దాం. రక్తాన్ని సరఫరా చేసే నరాలు, స్పర్శను తెలియజేసే నాడులు తాత్కాలికంగా గాని శాశ్వతంగా గాని పనిచెయ్యని పరిస్తితులలో మన శరీరంలోని కొన్ని భాగాలు స్పర్శతెలియకుండా, మన ఆధీనంలో లేని పక్షంలో దాన్ని తిమ్మిరి అని పిలుస్తారు. ఇక తిమ్మిర్లులో రకాలు ఒకసారి చూస్తే… తక్కువ స్పర్శ తెలియని దాన్ని తిమ్మిరి అని పిలుస్తారు.
ఆ తిమ్మిరి తక్కువగాను, తాత్కాలికమైనది అయితే దానిని తిమ్మిరి (numbness) అని పిలుస్తాం. అదే ఎక్కువ తీవ్రతలో ఉండి… ఎక్కువ కాలం లేకుంటే శాశ్వతంగా వుంటే మాత్రం పక్షవాతం అని పిలుస్తారు. శరీరంపై నొప్పి కలిగించే చిన్న చిన్న ఆపరేషన్స్ వంటివి చేయాలి అనుకున్నప్పుడు తిమ్మిరి ఇంజక్షన్ అంటే లోకల్ అనస్తీషియా ఇస్తారు. అది శరీరంలోని కొంతభాగం పైనే ప్రభావం చూపి కొంతసేపు నొప్పితెలియకుండా చేసేస్తుంది.
Also Read:కూల్చేద్దాం.. ఈ గడీల రాజ్యాన్ని.. బండి పిలుపు