ఈ రోజుల్లో కార్డు మోసాలు కాస్త ఎక్కువగానే జరుగుతున్నాయనే మాట వాస్తవం. డెబిట్ కార్డు అయినా క్రెడిట్ కార్డు అయినా సరే ఏదోక రూపంలో మోసం చేసి నగదు కాజేస్తున్నారు. వీటి దెబ్బకు కార్డులు వాడాలి అంటే ప్రజల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఇక కార్డుల గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
Also Read: కాళ్ళకు నీరు ఎందుకు చేరుతుంది…? ఆ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి…?
క్రెడిట్ కార్డు వెనుక భాగంలో సీవీవీ అని ఒక నెంబర్ ఉంటుంది. అసలు ఏంటీ దాని అర్ధం ఒకసారి చూద్దాం. దాని పూర్తి నామం కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ. ఆన్‌లైన్ లావాదేవీలను పూర్తి చేయడానికి ఈ నంబర్ చాలా ముఖ్యం. ఇది ఎవరితో షేర్ చేయకుండా ఉండటమే మంచిది. సీవీవీ నంబర్ క్రింది వివరాల ఆధారంగా డెబిట్ కార్డ్ జారీదారు (బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు) ద్వారా తయారు చేస్తారు. డెబిట్ కార్డ్ నంబర్ సర్వీస్ కోడ్ తో పాటుగా కార్డ్ గడువు తేదీ జారీదారు ప్రత్యేక కోడ్ తో కలిపి తయారు చేస్తారు.
సీవీవీ ని గుర్తించడం చాలా సులభంగా ఉంటుంది. ఇది మీ డెబిట్ కార్డ్ వెనుక ఉన్న మూడు అంకెల సంఖ్య ఆధారంగా గుర్తించవచ్చు.కొన్ని కార్డులకు నాలుగు నెంబర్ లు కూడా ఉంటాయి. ఇక సీవీవీలో రెండు భాగాలు ఉంటాయి. మొదటి భాగం చారల మాగ్నెటిక్ స్ట్రిప్‌లో కవర్ చేస్తారు. ఇందుకో మీ కార్డుకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఉంటుంది. కార్డును మాగ్నెటిక్ రీడర్ మెషీన్ ద్వారా స్వైప్ చేసినప్పుడు మాత్రమే ఆ సమాచారం తెలుస్తుంది. రెండవ భాగంలో ఆన్‌లైన్ లేదా టెలిఫోనిక్ లావాదేవీ చేసేటప్పుడు నమోదు చేస్తే సీవీవీ ఆధారంగా కొనుగోళ్ళు చేయవచ్చు.
Advertisements
Also Read: డెబిట్ కార్డులో సీవీవీ అంటే ఏంటీ…? దాన్ని ఎలా తయారు చేస్తారు…?