సినిమా పరిశ్రమలో దర్శకత్వం అనేది చాలా కీలకం. సినిమా ఎలా ఉండాలన్నది దర్శకుడి చేతుల్లోనే ఉంటుంది. ఇక సినిమా పరిశ్రమలో దర్శకుడి పోస్ట్ ఎంత కీలకమో… అతని దగ్గర ఉండే ముగ్గురి పోస్ట్ లు కూడా అంతే కీలకం. కో-డైరెక్టర్(సహ దర్శకుడు ), అసోసియేట్ డైరెక్టర్ ( సహచర దర్శకుడు ), అసిస్టెంట్ డైరెక్టర్ ( సహాయ దర్శకుడు ). అసలు ఈ ముగ్గురి పాత్ర ఏంటో ఒకసారి చూద్దాం.
అసిస్టెంట్ డైరెక్టర్
ఈయన గారు… రెండు మూడు రకాల పనులు చేస్తారు. మొదటి సారి సినిమా షూటింగ్ లో పాల్గొంటే ‘ క్లాప్ అసిస్టెంట్ ‘ గా తీసుకుంటారు. దాని నెంబర్ లు మార్చడం, కెమరా స్టార్ట్ అవ్వగానే క్లాప్ కొట్టడం, వీటిని బుక్ లో ఎంటర్ చేయడం వంటివి చేస్తారు. ఇక తర్వాతి రోజు షూట్ కి సంబంధించి బుక్ రెడీ చేసి… డైలాగులు అన్నీ కలెక్ట్ చేసుకుంటారు. వాటిని నటులకు ఇస్తారు. జూనియర్ నటులతో సమన్వయం చేసుకుంటారు.
అసోసియేట్ డైరెక్టర్
అసిస్టెంట్ డైరెక్టర్లకు కేటాయించాల్సిన బాధ్యతలు నుంచి వారిచేత పనిచేయించటం అన్నీ వీళ్ళే చూస్తే. కో డైరెక్టర్ చెప్పే పనులు అన్నీ ఈయనే చూస్తారు. ప్రొడక్షన్, కాస్ట్యూమ్స్ వంటివి చూసుకోవాల్సి ఉంటుంది.
కో డైరెక్టర్
దర్శకుని తర్వాత కీలకమైన బాధ్యతలను కో డైరెక్టర్ నిర్వహిస్తారు. ముఖ్య నటీనటుల నటన దర్శకుడు పర్యవేక్షణలో జరిగితే, మిగిలిన వారికి కో డైరెక్టర్ చూసుకుంటారు. రచయితల చేత సంభాషణలు రాయించటం, షూటింగ్ టైం లో సంభాషణలో మార్పులు చేయడం వంటివి, మ్యూజిక్ సెట్టింగ్స్ లో కూర్చోవడం వంటివి చేస్తూ ఉంటారు. లొకేషన్ ఎంపిక విషయంలో ఆయన కీలకంగా ఉంటారు. ఒక్కో దర్శకుడు రెండు మూడు సినిమాలకు డైరెక్టర్ గా ఉన్నప్పుడు కో డైరెక్టర్ ఎక్కువ కష్టపడతారు.