పాలు తాగాలంటే కొందరికి కష్టంగా ఉంటుంది. మరికొందరు అందులో ఏదోక పౌడర్ వేసుకుని తాగుతూ ఉంటారు. ఇక పాలల్లో చాలా మంది పసుపు వేసుకుని తాగుతూ ఉంటారు. అలా తాగడం మంచిదేనా…? కచ్చితంగా మంచిది. పాశ్చత్య దేశాలలో దీన్ని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తూ ఉంటారు. అక్కడ దీనికి సంబంధించి విస్తృతంగా ప్రచారం కూడా చేస్తూ ఉంటారు.
Also Read:పిడుగు పడితే ప్లగ్ ఎందుకు పీకాలి…?
ఇలా తాగితే… యాంటీ ఆక్సిడంట్స్ శరీరం లో ఉన్న కణాలను కాపాడి రోగ నిరోధక శక్తి ని పెంచుతూ ఉంటాయి. వాపులు , కీళ్ళనొప్పుల ను తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెదడు సంభందిత సమస్యలకు కచ్చితంగా పరిష్కారం ఉంటుంది. గుండె పనితీరును మెరుగు పరిచేందుకు ఉపయోగపడతాయి. ఇన్సులిన్ తయారీ మెరుగుపరచి -బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంది. క్యాన్సర్ వ్యాధిని తట్టుకోవడానికి కూడా కొంత వరకు సహాయం పడుతుంది.
ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడే శక్తి లభిస్తుంది. అదే విధంగా అజీర్ణ వ్యాధులకు -అల్సర్ లలో మేలు జరుగుతుంది. కాల్షియమ్ -విటమిన్ డీ ఎక్కువగా ఉండటంతో ఎముకలలో బలం చేకూరుతుంది. అయితే ఇక్కడ ఒక కీలక విషయం తెలుసుకోవాలి. శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు పాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటం చాలా వరకు ఉత్తమం. పసుపు పాలకి బదులుగా కషాయం తయారు చేసుకుని త్రాగవచ్చు. ఇక విదేశాల్లో దాల్చిన చెక్క లేదంటే అల్లం వేసుకుని కూడా పాలు తాగుతూ ఉంటారు.
Also Read:తెలంగాణలో అఘాయిత్యాలు.. జాతీయ మహిళా కమిషన్ దృష్టి!