వేసవి చివర్లో, తొలకరి మొదట్లో ఎక్కువగా వడగండ్ల వాన పడుతూ ఉంటుంది. దీనితో మామిడి పంటకు తీవ్ర నష్టం కలుగుతుంది అనే చెప్పాలి. అలాగే మరికొన్ని పంటలు కూడా తీవ్రంగానే ఇబ్బంది పడుతూ ఉంటాయి. అయితే అసలు ఈ వడగండ్ల వాన ఎందుకు పడుతుంది ఏంటీ అనేది చాలా మందికి అవగాహన లేదు. అసలు ఎందుకు పడుతుంది ఏంటీ అనేది చూద్దాం.
Also Read:టికెట్ రేట్లపై మరోసారి స్పందించిన నాని
వడగండ్ల వానని వాతావరణ పరిభాష లో ఘన వర్షపాతం అంటారు. చాలా ఎత్తుగా ఉండే క్యుములో నింబస్ మేఘాలలో సూపర్ కూలెడ్ నీటి బిందువులు కలయికతో మేఘాల మధ్య పొరలలో ఈ వడగండ్లు ఏర్పడుతాయి. భూమిని చేరేటప్పుడు వీటి సగటు వేగం గంటకు 106 మైళ్ళు ఉంటుంది. అంటే ఒక పెద్ద గడ్డ తల మీద పడితే పగిలిపోవడమే. సాధారణంగా వడగండ్ల వాన ఏర్పడడం అనేది వాతావరణ పరిస్థితుల మీదనే ఆధారపడి ఉంటుంది.
బాగా ఏర్పడిన క్యూములో నింబస్ మేఘాలు, 65000 అడుగుల ఎత్తు వరకు వెళ్తాయి. వీటి నుంచే భారీగా ఉరుములు పిడుగులు. ఈ మేఘాలలో ఆ టైమ్ లో బలమైన గాలులు వీస్తూ ఉంటాయి. ఆ గాలి మేఘాల పైపొరలలోకి వెళ్తూ… ఆ సమయంలో… బాగా శీతలీకరణ కాబడిన నీటి బిందువులు మంచుగా మారుస్తూ ఉంటుంది. ఆ తర్వాత వాటికి అనుకూల వాతావరణం ఏర్పడగానే భూమి మీద పడతాయి. ఈ పరిస్థితుల్లో భూమి గురుత్వాకర్షణ శక్తి ఈ మంచు ముద్దల మీద పని చేయడంతో పడ్డప్పుడు అవి మంచుగా ఉంటాయి. వాటినే వడగండ్లు అని అంటారు.
Also Read:రానాది చాలా పెద్ద మనసు- సాయిపల్లవి