ఒకవైపు కరోనా తగ్గుముఖం పడుతుంటే దాని వేరియంట్ గా వచ్చిన డెల్టా పెరుగుతూ వస్తోంది. మరోవైపు హవానా సిండ్రోమ్ అంటూ గత కొన్ని రోజులుగా మరో వ్యాధి అందర్నీ అయోమయంలో పడేస్తోంది. ఈ నెల ప్రారంభంలో యూఎస్ సిఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్ భారత పర్యటన లోనే ఈ లక్షణాలు ఎదుర్కొంటున్నట్లు చెప్పడంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అయితే హవానా సిండ్రోమ్ అంటే ఏమిటి అనే విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు. 2016 లో మొదటగా ఈ సిండ్రోమ్ కేసులు నమోదయ్యాయి. అయితే అది క్యూబాలో కావడం గమనార్హం.
హవానా సిండ్రోం లక్షణాలు ఏమిటంటే…
వికారం, తీవ్రమైన తలనొప్పి, అలసట, మైకం, నిద్ర సమస్యలు, వినికిడి లోపం. శాశ్వతంగా మీద దెబ్బ తినడానికి కూడా ఈ సిండ్రోమ్ కారణం అవుతుందట. సుమారు 200 మంది యూఎస్ సిబ్బంది, వారి కుటుంబాలు నెలరోజులపాటు అప్పట్లో సిండ్రోమ్ లక్షణాలు ఎక్స్పీరియన్స్ చేశారు.హవానా సిండ్రోమ్ కు కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. కానీ కొంతమంది పరిశోధకుల ప్రకారం ఈ సిండ్రోమ్ అల్ట్రాసౌండ్, అల్ట్రాసోనిక్ సిగ్నల్స్, పురుగుల మందులు, ఇన్ఫెక్షన్ ఏజెంట్లు తదితర కారణాల వల్ల వ్యాపిస్తోంది.
హవానా సిండ్రోమ్ కు చికిత్స…
నిజానికి ఈ వ్యాధికి ఇంకా చికిత్స లేదు. ఎందుకంటే దీనికి కచ్చితమైన కారణమేంటో ఇంకా వైద్యులు కనుగొన లేకపోయారు. కానీ పేషేంట్స్ కు కలిగే వికారం, మైకం వాటికి సంబంధించి ప్రాథమిక చికిత్స మాత్రం అందుతోంది.