నాగాలాండ్ కాల్పుల ఘటనపై కేంద్రాన్ని టార్గెట్ చేస్తోంది కాంగ్రెస్. కాల్పులపై విచారం వ్యక్తం చేసిన ఆపార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత ప్రాంతంలోనే పౌరులు, భద్రతా సిబ్బంది సురక్షితంగా లేనప్పుడు హోంశాఖ ఏం చేస్తోందని ట్విట్టర్‌లో ప్రశ్నించారు రాహుల్.
ఇక కాల్పుల ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మోన్ జిల్లాలోని తిరులో కొందరు కార్మికులు వెళ్తున్న వాహనంపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. చాలామంది పౌరులు ప్రాణాలు కోల్పోగా.. కొందరు గాయపడ్డారు. తర్వాత స్థానికులు బలగాల వాహనాలను తగులబెట్టారు. ఈ ఘటనలపై ఇప్పటికే నాగాలాండ్ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.