అప్పట్లో ఎన్టీఆర్ అంటే స్టార్ హీరో. ఆయనకు ఎదురు చెప్పే వాళ్ళు లేరు అనే మాట వాస్తవం. అయితే ఆయన కొందరు నటుల విషయంలో మాత్రం చాలా సానుకూలంగా ఉండేవారు అనే టాక్ ఉండేది అప్పట్లో. ఇద్దరు ముగ్గురు హీరోలు, కొందరు దర్శకులు, అలాగే హీరోయిన్ల విషయంలో ఆయన పట్టుదలగా వెళ్ళిన సందర్భాలు ఉండవు అనే మాట మనం వింటూ ఉంటాం. ముఖ్యంగా భానుమతి విషయంలో.
భానుమతి అంటే ఎన్టీఆర్ కు ముందు నుంచి గౌరవం ఎక్కువ అని అంటారు. ఆమె నటన విషయంలో ఎన్టీఆర్ ను బాగా ఆకట్టుకున్నారు. ఏ పాత్ర అయినా సరే చివరి వరకు ఆమె బాగా చేసేవారు అనే టాక్ ఉండేది. అయితే కొన్ని సందర్భాల్లో ఆమె పట్టుదలగా ఉండేవారు. తన పాత్ర తగ్గితే మాత్రం ఊరుకునే వారు కాదు అని ఒక టాక్ ఉంది. ఇలా ఒక సందర్భంలో ఎన్టీఆర్ ను కూడా ఆమె ఇబ్బంది పెట్టారని అంటారు.
టాలీవుడ్ లో పెద్ద హిట్స్ గా నిలిచిన రెండు సినిమాలు బొబ్బిలి పులి, పల్నాటి యుద్ధం. ఈ రెండు సినిమాల్లో భానుమతి హీరోయిన్ గా చేసారు. అయితే బొబ్బిలి పులి సినిమాలో తన పాత్రకు అన్యాయం జరిగిందని ఆమె అలిగారు. ఎన్టీఆర్ దగ్గరే అసహనం చూపించారు. ఇక అదే సమయానికి పల్నాటి యుద్ధం కథ విన్న ఎన్టీఆర్… భానుమతి అయితే బాగుంటుంది అన్నారట. ఆమె ముందు నో చెప్పగా ఆ సినిమాలో నాగమ్మ పాత్రకు ఎక్కువ వెయిట్ ఉంటుందని చెప్పి ఎన్టీఆర్ ఆమెను ఒప్పించారు.
Also Read: భాషా సినిమా మిస్ అయిన తెలుగు హీరో ఎవరు…?