మన దేశంలో పోలీసు వ్యవస్థ అత్యంత బలంగా ఉంటుంది. పోలీసు వ్యవస్థకు సంబంధించి అనేక రకాల ఆసక్తికర విషయాలు ఉంటాయి. ముఖ్యంగా అరెస్ట్ ప్రక్రియ అనేది చాలా మందికి అవగాహన ఉండదు. అసలు ఏ పద్దతిలో అరెస్ట్ చేస్తారు, ఫస్ట్ డిగ్రీ అంటే ఏంటీ, సెకండ్ డిగ్రీ అంటే ఏంటీ, థర్డ్ డిగ్రీ అంటే ఏంటీ అనేది చాలా మందికి తెలియని విషయాలు. అలాగే ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్ అనేవి కూడా అవగాహన ఉండదు.
Also Read:బ్రిడ్జ్‌లే టార్గెట్.. నెల రోజుల్లోనే రెండు వంతెనలు మాయం..!
ఇక పోలీస్ కస్టడీ, జ్యుడీషియల్ కస్టడీ అనే విషయాలు కూడా అవగాహన ఉండదు చాలా మందికి. ఏదైనా నేరం జరిగినప్పుడు పోలీసు అధికారి మరింత సమాచారం సేకరించడం కోసం మరియు విచారణ నిమ్మిత్తం అనుమానిత వ్యక్తిని అరెస్టు చేయడాన్ని పోలీస్ కస్టడీ అంటారు. పోలీసు కస్టడీ యొక్క మరొక లక్ష్యం సాక్ష్యాలను నాశనం చేయకుండా కట్టడి చేయడం. చాలా మంది నేరస్థులు సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి… పోలీసులు జాగ్రత్త పడుతూ ఉంటారు.
ఇక జ్యుడిషియల్ కస్టడీ విషయానికి వస్తే… అరెస్టు చేసిన వ్యక్తిని మేజిస్ట్రేట్ అదుపులో ఉంచుకుని జైలుకు పంపించడం జరుగుతుంది. ఈ కస్టడీ సమయంలో పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తిని మేజిస్ట్రేట్ అనుమతి తర్వాత మాత్రమే విచారించాల్సి ఉంటుంది. సాక్ష్యాలను సేకరించి దర్యాప్తు పూర్తి చేసినందుకు నిందితులను పోలీసుల అదుపులోకి పంపడమే. ప్రస్తుత లేదా భవిష్యత్తులో జరిగే ప్రమాదాన్ని ఊహించి సహేతుకమైన కారణాలు ఉన్నప్పుడు అనుసరించాల్సిన ముందు జాగ్రత్త చర్య జ్యుడిషియల్ కస్టడీ.
Advertisements
Also Read:బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తాకు యాక్సిడెంట్.. గాయాలతో దైవ దర్శనం..!