మన చట్టంలో మనకు అవగాహన లేని విషయాలు కొన్ని ఉంటాయి. అందులో ఒకటి లోక్ అదాలత్… దీని ముఖ్య ఉద్దేశం మనకు అవగాహన ఉండదు. అసలు లోక్ అదాలత్ ముఖ్య ఉదేశ్యం కోర్ట్ లో ఉన్న పెండింగ్ కేస్ లు తగ్గించడంతో పాటుగా ఏదైనా సమస్య ఉంటే గనుక కోర్ట్ వరకు వెళ్ళకుండా, లోక్ అదాలత్ ను సంప్రదించడం ద్వారా చవకగా, తక్షణ పరిష్కారం పొందడం.
Also Read: ఎఫ్ఐఆర్ లో కులం పేరు ఎందుకు నమోదు చేస్తారు…?
అసలు అవి ఏ విధంగా పని చేస్తాయో ఒకసారి చూస్తే… ఏదైనా కోర్ట్ లో పెండింగ్ లో వున్న కేస్ లో ఇరు పక్షాలూ రాజీ కి వస్తే ఏ కోర్ట్ లో అయితే కేస్ పెండింగ్ లో ఉంటుందో ఆ కోర్ట్ లో వారి కేస్ ను లోక్ అదాలత్ కు బదలీ చెయ్యమని మెమో ఫైల్ చేసి అక్కడ ఇరుపక్షాల వారు వారి రాజీ అంశాలను లోక్ అదాలత్ కి సమర్పించడం ద్వారా లోక్ అదాలత్ వారు ఒక అవార్డ్ ఇస్తారు. దీనికి రెండు పక్షాలు కట్టుబడి ఉండాలి. ఈ విధానాన్ని రెగ్యులర్ కోర్ట్ ఇర్చే డిక్రీ లా అనుకోవచ్చు.
ఇలాంటి సందర్భాల్లో ఆల్రెడీ కట్టిన కోర్ట్ కు చెల్లించిన ఫీజు వెనక్కు తీసుకునే సౌకర్యం కూడా ఉంది. సివిల్ కేస్ లతో పాటుగా క్రిమినల్ కేసుల్లో కాంపౌండ్బుల్ నేరాలు అంటే కాంప్రొమైజ్ అవ్వదగ్గ నేరాలు లాంటి వాటికి కూడా అవార్డు పాస్ చేసే సదుపాయం ఉంటుంది. అయితే కుటుంబ వివాదాలు /సమస్యలు లోక్ అదాలత్ పరిష్కరించడానికి మాత్రం చట్టం అనుమతి ఇవ్వలేదు. ఇక మరో కీలక విషయం… ఏదైనా రెండు పార్టీల మధ్య రాబోయే వివాదం కోర్ట్ కి వెళ్ళకుండా కూడా PLC ( Pre litigation case) ను ఫైల్ చేసి రాజీ చేసుకొని అవార్డ్ పొందవచ్చు.

Also Read: మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ