ఈ రోజుల్లో ఆధార్ కార్డు లేకుండా ఏ పని జరగట్లేదు. ఆధార్ కార్డు నెంబర్ కీలకం కావడంతో చాలా వరకు కూడా ఇప్పుడు ప్రజలకు ఆధార్ కార్డుని కాపాడుకోవడం పెద్ద సమస్య అయిపోయింది. ఇక ఇప్పుడు ఆధార్ కార్డు ని సేవ్ చేసుకోవడానికి కొత్త వెర్షన్ ఒకటి వచ్చింది. అదే ఆధార్ మాస్క్ వెర్షన్. ఆధార్ మాస్క్ వెర్షన్ లో 12 అంకెల ఆధార్ నంబర్‌లోని మొదటి ఎనిమిది అంకెలను కనపడవు.
Also Read:మందేస్తో.. చిందేస్కో..!
చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. దీంతో కార్డు పోయినా దుర్వినియోగం కాకుండా చూసుకోవచ్చు. ఇక మాస్క్ ఆధార్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మాస్క్‌డ్ ఆధార్ మీ ఆధార్ నంబర్‌లోని మొదటి 8 అంకెలను మాస్క్ చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డుని డౌన్‌లోడ్ చేసినప్పుడు, మీ ఫోటో, క్యుఆర్ కోడ్, ఆధార్ నెంబర్ వంటివి అక్కడ కనపడతాయి. నెంబర్ కనపడకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మీరు గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డు మాత్రమే ఇవ్వాల్సిన చోట ఈ కార్డు ఇవ్వొచ్చు. ఇక దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది చూస్తే…
ఆధార్ UIDAI వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయండి. (https://uidai.gov.in/.)
2. హోమ్‌పేజీలో, ‘డౌన్‌లోడ్ ఆధార్’పై క్లిక్ చేయండి
3. మీ 12 అంకెల నెంబర్ ను ఎంటర్ చేసి, ‘ ఐ వాంట్ మాస్క్‌డ్ ఆధార్ మీద క్లిక్ చెయ్యాలి.
4. క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి, ‘ ఓటీపీ’ మీద క్లిక్ చేయండి
5. డాక్యుమెంట్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు వన్-టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది.
ఆ తర్వాత డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేస్తే మీకు ఆధార్ వస్తుంది.
Also Read:రాష్ట్రమంతటా నిరసనలు.. టీఆర్ఎస్ పై నిప్పులు