ప్రస్తుతం థ్యాంక్యూ సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. ఈ మూవీ తర్వాత అతడు చేయాల్సిన సినిమా ఏంటనేది ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. నిజానికి చైతూ దగ్గర ఇప్పుడు 4 సినిమాలున్నాయి. వాటిలో 2 సినిమాల్ని అతడు ఫైనల్ చేశాడు. అయితే ఆ 2 సినిమాల్లో దేన్ని ముందుగా సెట్స్ పైకి తీసుకురావాలనేది చైతూ ఇంకా నిర్ణయించుకోలేదు.
శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు నాగచైతన్య. అదే సమయంలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాతగా మరో సినిమాకు కూడా కమిట్ అయ్యాడు. వీటిలో ఒకటి మాస్ సినిమా, ఇంకోటి పూర్తిగా క్లాస్ సినిమా. అందుకే ఈ రెండింటిలో దేన్ని ముందుగా సెట్స్ పైకి తీసుకురావాలో నిర్ణయించుకోలేకపోతున్నాడు చైతూ.
ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. ఇది పూర్తిగా క్లాస్ మూవీ అని తెలుస్తోంది. కాబట్టి ఈ సినిమా తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో మాస్-యాక్షన్ సినిమాను చైతూ చేసే ఛాన్స్ ఉందటూ కథనాలు వస్తున్నాయి. మరి చైతు ఎటు ఓటేస్తాడో చూడాలి
మరోవైపు ఈ 2 సినిమాలు కాకుండా.. మరో సినిమా కూడా చైతూ దగ్గర పెండింగ్ లో ఉంది. రీసెంట్ గా మానాడు అనే తమిళ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకున్నారు సురేష్ బాబు. ఆ మూవీ తెలుగు రీమేక్ లో చైతూ నటించే అవకాశం ఉంది