గతంలో ఎంతో మంది హీరోలు సూపర్ డూపర్ హిట్ ని అందుకొని నెంబర్ వన్ పొజిషన్ కోసం తెగ ప్రయత్నాలు చేశారు. అందులో ఉదయ్ కిరణ్, తరుణ్, వడ్డే నవీన్ ఇలా చాలామంది ఉన్నారు. వడ్డే నవీన్ కూడా వరుస హిట్లను అందుకుని మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఫ్యామిలీ హీరోగా మారిపోయాడు.
1997 లో రిలీజ్ అయిన కోరుకున్న ప్రియుడు సినిమా తో నవీన్ తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత నవీన్ కు వరుస ఆఫర్స్ వచ్చాయి. కాగా నవీన్ ఇండస్ట్రీ లోకి రావడానికి కారణం తన తండ్రి వడ్డే రమేష్ అట. రమేష్ నిర్మాత కావడంతో నవీన్ కి కూడా సినిమాలపై ఇంట్రెస్ట్ ఏర్పడిందట.
కానీ ప్రస్తుతం నవీన్ ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉన్నాడు. ఇదిలా ఉండగా వడ్డే నవీన్ నందమూరి కుటుంబానికి అల్లుడు అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఎన్టీ రామారావు కొడుకులలో ఒకరైన నందమూరి రామకృష్ణ కూతురును వడ్డే నవీన్ పెళ్లి చేసుకున్నారు. ఆ సంబంధాన్ని కూడా ఎన్టీఆర్ సెట్ చేశారట.
బాలయ్య సిన్సియర్ గా లవ్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా ? ఎన్టీఆర్ వల్లే విడిపోయారట !!
ఎన్టీఆర్ కు వడ్డే నవీన్ మంచి స్నేహితుడని అప్పట్లో టాక్ నడిచేది. పెళ్లికి ముందే వడ్డేనవీన్ రామకృష్ణ కూతురు తో ప్రేమలో ఉండేవాడట. ఎన్టీఆర్ వల్ల ఈ పెళ్లి జరిగిందని సమాచారం.
అయితే ఆ తర్వాత ఏం జరిగిందో గానీ వడ్డె నవీన్ విడాకులిచ్చి వేరొక పెళ్లి చేసుకున్నారు. నందమూరి కుటుంబంతో బంధుత్వం తెంచుకున్నారు. కానీ నందమూరి హీరోలతో ఎన్టీఆర్ తో మాత్రం నవీన్ సన్నిహితంగా ఉన్నారట. ఇది అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు.