ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈడీ ఇచ్చిన నోటీసులపై ఎమ్మెల్సీ కవిత ఎల్లుండి విచారణను ఎదుర్కోబోతున్నారు. అయితే గురువారం విచారణకు రావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై కవిత రిక్వెస్ట్ ను అధికారులు పరిగణలోకి తీసుకున్నారు.
9,10 తేదీల్లో ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని లేఖలో రాయడంతో 11న విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. అయితే కవిత రిక్వెస్ట్ లను దర్యాప్తు సంస్థలు పరిగణలోకి తీసుకోవడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. సీబీఐ, ఈడీ కవిత లేఖలను ఎందుకు కన్సిడర్ చేస్తోందని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ విమర్శలు గుప్పించారు.
ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించిన జడ్సన్.. ఇంతకీ మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత ధర్నాకు హోం శాఖ అనుమతి ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు. ఇదంతా బీఆర్ఎస్ సింపతి పొందేందుకు బీజేపీ కల్పిస్తున్న అవకాశంగా ఆయన పేర్కొన్నారు.
ఈ అంశాన్ని బీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ గా చూపించి కాంగ్రెస్ ను బలహీనపరిచే కుట్రగా అభివర్ణించారు జడ్సన్. ఇంత జరుగుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.