మనం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళాలి అంటే ఎంత సమయం పడుతుంది. రెండు అడుగులు వేయాలన్నా సరే కనీసం 2 నుంచి మూడు సెకన్ల సమయం పడుతుంది. మరి స్విచ్ వేస్తే లైట్ వెంటనే తిరుగుతుంది. అసలు కరెంట్ స్పీడ్ ఎంత ఉంటుంది…? ఇది చాలా మందికి అవగాహన లేదు. కాని విద్యుత్తు వేగం సుమారుగా కాంతి వేగంతో సమానంగా ఉంటుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
విద్యుత్తు వాహకాలను బట్టి 60–90% వేగం మారే అవకాశం ఉంటుంది. సుమారు 2.7లక్షల కిలోమీటర్ల వేగంతో కరెంట్ ప్రయాణిస్తుంది. ఏంటీ గంటకు అనుకున్నారా…? సెకన్ కు విద్యుత్ వేగం అది. అది కేవలం అంచనా మాత్రమే. అంతకు మించి ఉండవచ్చు అని నిపుణులు అంటున్నారు. ప్రపంచంలోనే అతి పొడవైన విద్యుత్తు ప్రవాహ లైను బ్రెజిల్ దేశంలో ఉంటుంది. దీని పొడవు ఏకంగా 2,543కిలోమీటర్లుగా ఉంది. ఇది 800 కిలో వోల్ట్స్ రేటింగ్ తో , 11.2గిగా వాట్స్ సామర్ధ్యంతో…
Advertisements
విద్యుత్తుని జల విద్యుత్తు కేంద్రం నుండి ఇంకో నగరం వైపు పంపుతుంది. ఈ విద్యుత్తు లైన్ జల విద్యుత్హు కేంద్రం లో విద్యుత్తు సరఫరా మొదలుపెట్టడానికి సర్క్యూట్ బ్రేకర్ ఆన్ చేయగానే అదే సెకనులోపే ఇంకో వైపు ఆ విద్యుత్తు ప్రవాహం చేరుకుంటుంది. అంటే 2,543కిలోమీటర్లు సెకను కంటే తక్కువ సమయంలో కరెంట్ ప్రయాణం చేస్తుంది. ఇక ఆ వేగం మనకు తెలియాలి అంటే… లక్షల కిలోమీటర్ల విద్యుత్తు తీగ కావాలి.